ఆవుల కాపరి దారుణహత్య | Cow Shepherd Murder In Kurnool District | Sakshi
Sakshi News home page

ఆవుల కాపరి దారుణహత్య

Aug 17 2019 10:49 AM | Updated on Aug 17 2019 10:56 AM

Cow Shepherd Murder In Kurnool District - Sakshi

మృతిచెందిన వెంకటకృష్ణ

సాక్షి, గడివేముల/ కర్నూలు: మండల పరిధిలోని ఎల్‌కే తండాలో ఓ ఆవుల కాపరి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పిన్నాపురం గ్రామానికి చెందిన బోయ మీదివేముల వెంకటేశ్వర్లు కుమారుడు ఎం.వెంకటకృష్ణ(21 ఎల్‌కె తండాకు చెందిన స్వామినాయక్‌ వద్ద ఆవుల కాపరిగా ఉన్నాడు. గురువారం వెంకటకృష్ణ సొంత పని నిమిత్తం గని గ్రామంలోని పెదనాన్న ఇంటికి వెళ్లాడు. అక్కడున్న వెంకటస్వామిని అదే రోజు రాత్రి స్వామినాయక్‌ ఎల్‌కె తండాకు తీసుకొచ్చాడు. రాత్రి ఏం జరిగిందో ఏమో? తెల్లవారుజామున ఆవుల దొడ్డి వద్ద మంచంపై రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చిరంజీవి, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ సీఐ వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కర్నూలు నుంచి డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి వివరాలు సేకరించారు. పోలీస్‌ జాగిలం స్వామి నాయక్‌ ఇంటి వద్దకు వెళ్లి, వెనక్కు వచ్చింది. దీంతో స్వామినాయక్‌ సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.    

Advertisement
 
Advertisement
Advertisement