రుణం యమపాశం | Couple Suicide in Karnataka | Sakshi
Sakshi News home page

రుణం యమపాశం

May 11 2019 11:36 AM | Updated on Jul 10 2019 8:00 PM

Couple Suicide in Karnataka - Sakshi

నాగరాజు, మంజుల(ఫైల్‌)

కర్ణాటక ,మండ్య : అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్ప డ్డ ఘటన శుక్రవారం మద్దూరు తాలూకా మేళ్లహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది. మూడేళ్ల క్రి తం వివాహం చేసుకున్న నాగ రాజు(28), మంజుల(24)లు ఇద్దరు పిల్లలతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురం అప్పుల కారణంగా అల్లకల్లోలానికి గురైంది. వ్యక్తిగత అవసరాల కోసం కొద్ది కాలం క్రితం రూ.1.5 లక్షలు అప్పు చేశారు. సకాలంలో అప్పులు తీర్చేలేకపోవడంతో రుణదాతల వేధింపులు తీవ్రతరమయ్యాయి. దీంతో శుక్రవారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేఎం దొడ్డి పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కాగా మృతురాలు మంజుల ఐదు నెలల గర్భిణీ అనే విషయం తెలియడంతో పాటు ఇద్దరు పిల్లల రోదనతో గ్రామస్తులతో పాటు పోలీసులు సైతం కంటతడి పెట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement