నటుడి కుమారుడిపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు | Complaint registered on Ahuthi prasad son Karthik prasad in Banjarahills PS | Sakshi
Sakshi News home page

నటుడి కుమారుడిపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు

Jun 6 2019 4:41 PM | Updated on Jun 6 2019 4:44 PM

Complaint registered on Ahuthi prasad son Karthik prasad in Banjarahills PS - Sakshi

థియేటర్‌లో జాతీయ గీతం వస్తున్నా లేచినిలబడకుండా.. పక్కనున్నవారిపై బూతులతో విరుచుకుపడటంతో.. 

సాక్షి, హైదరాబాద్‌ : నటుడు ఆహుతి ప్రసాద్ కుమారుడు కార్తీక్ ప్రసాద్‌పై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఆర్కే సినీప్లెక్స్‌లో చిత్ర ప్రారంభానికి ముందు జాతీయ గీతం వస్తుండగా కార్తీక్ ప్రసాద్‌ లేచి నిలబడలేదు. అక్కడున్న వారు జాతీయ గీతానికి గౌరవం ఇవ్వవా అని అడగడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ బూతులతో వారిపై మండిపడ్డాడు. దీంతో కార్తీక్‌ ప్రసాద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, క్యాన్సర్‌తో ఆహుతి ప్రసాద్ నాలుగేళ్ల కిందటే మరణించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement