‘వందేమాతరం’ ఉత్తర్వులపై సుప్రీం
న్యూఢిల్లీ: జాతీయగేయం వందేమాతరం మొత్తం ఆరు చరణాలను పాఠశాలలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించాలంటూ జనవరి 28వ తేదీన కేంద్ర హోం శాఖ జారీచేసిన సర్క్యులర్‌ను సవాల్‌చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌ను బుధవారం పక్కనబెట్టింది.
తమ విద్యాసంస్థలో పూర్తిగేయం పాడకపోతే ప్రభుత్వం నుంచి వివక్ష, శిక్ష, తీవ్ర పరిణామాలను ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ముహమ్మద్ సయీద్ నూరీ అనే వ్యక్తి దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంఛోలీల ధర్మాసనం విచారించింది.
‘‘హోం శాఖ ఇచ్చిన ఆరు చరణాల ఆలాపన ఉత్తర్వులను తప్పకుండా పాటించాల్సిన అవసరం లేదు. అదేం ఆదేశం కాదు. అడ్వైజరీ మాత్రమే. పూర్తిగా పాడనంత మాత్రాన శిక్షలు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో హోంశాఖ ప్రస్తావించలేదు. మీ అకాడమీ లేదా పాఠశాలలో 6 చరణాలు పాడాల్సిందే అని ఎవరూ మిమ్మల్ని ఆదేశించజాలరు’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది.


