సహజీవనం చేసి చంపేశాడు

Cohabitation and killing - Sakshi

రాజూరాలో గిరిజన మహిళ హత్య

నిందితుల అరెస్టు, రిమాండ్‌

ఖానాపూర్‌: సహజీవనం సాగిస్తున్న వ్యక్తే ఆ మహిళ పాలిట కాలయముడయ్యాడు. మద్యం మత్తులో క్షణికావేశానికి లోనై నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఖానాపూర్‌ సీఐ ఆకుల అశోక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కడెం మండలం పెద్దూరుకు చెందిన టేకం బుజ్జిబాయి(43)కు ఇరవై ఏళ్ల క్రితం రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది.

గత కొన్నేళ్లుగా భర్తతో దూరంగా ఉంటున్న బుజ్జిబాయికి మండల కేంద్రంలోని ఓ వసతిగృహంలో పనిచేసే టేకం బాపురావుతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఆరు నె లల క్రితం ఉపాధి నిమిత్తం ఖానాపూర్‌లోని మండలం రాజురా గ్రామంలోని బుజ్జిబాయి సోదరుడు ఆ త్రం గంగారాం వద్దకు వెళ్లారు. గంగారాం వారిని గ్రామానికి చెందిన గోగు రాజలింగు వద్ద మొక్కజొన్న కావలి పనికి కుదిర్చాడు.

గత నెల 24న బుజ్జిబాయి, బాపురావు మొక్కజొన్న చేను వద్దకు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న బాపురావు బుజ్జిబాయితో గొడవకు ది గాడు. క్షణికావేశంతో పక్కనే ఉన్న కర్రతో ఆమె తలపై దాడి చేశాడు. రక్తం మడుగులో ఉన్న బుజ్జిబాయిని చూసి అక్కడినుంచి పారిపోయాడు. మరునాడు సం ఘటన స్థలానికి వచ్చి చూడగా బుజ్జిబాయి మృతి చెందడం గమనించి పారిపోయాడు.

అదే రోజు య జమాని గోగు రాజలింగు బుజ్జిబాయి మృతదేహాన్ని చూశాడు. సోదరులు మల్లేశ్, చిన్నరాజన్న, నారాయణ సహకారంతో మృతదేహాన్ని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పడేశాడు. 29న బుజ్జిబాయి తమ్ముడు గంగారాంకు తెలియజేసి ఇరువురు కలిసి మృతదేహాన్ని అక్కడే ఖననం చేశారు. అనంతరం ఈ నెల 2న కడెంలో ఉండే మరో సోదరుడు ఆత్రం బాపురావు, గంగారాం కలిసి పెంబి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు రాజూరాలోని గంగారాం ఇంటికి వచ్చిన టేకం బాపురావును అరెస్టు చేశారు. అతడిపై హత్య కేసు నమోదు చేశారు. అలాగే సాక్ష్యాధారాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించిన ఆత్రం రాజలింగు, గోగు రాజలింగు, గోగు మల్లేశ్, గోగు చిన్నరాజన్నలపై ఐపీసీ 201 కింద కేసులు నమోదు చేశారు. గోగు నారాయణ పరారీలో ఉండగా, మిగతా నిందితులను రిమాండ్‌ చేశామని సీఐ అశోక్, ఎస్సై సంజీవ్‌కుమార్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top