చిట్టీలపేరుతో భారీ కుచ్చుటోపీ | chit funds fraud in hyderabads ECIL | Sakshi
Sakshi News home page

చిట్టీలపేరుతో భారీ కుచ్చుటోపీ

Nov 20 2017 10:34 PM | Updated on Sep 4 2018 5:32 PM

సాక్షి, హైదరాబాద్‌ : రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈసీఐఎల్‌లో చిట్టీలపేరుతో రూ.కోటి యాభై లక్షలు కుచ్చుటోపీ పెట్టారు. వివరాలు.. ఈసీఐఎల్ చౌరస్తాలోని త్రిపుర చిట్ ఫండ్స్ పేరుతో సురేష్‌ బాల, పీవీ కృష్ణ ప్రసాద్‌ అనే వ్యక్తులు 30 మంది వద్ద చిట్టీలు వేయించుకున్నారు. చిట్టీలు ఎత్తి డబ్బులు ఇవ్వమంటే చాలా రోజులుగా రేపు మాపని తప్పించుకుని తిరుగుతున్నారు. పది రోజుల నుంచి కార్యాలయానికి తాళం వేసి కనిపించకుండా పోవడంతో కుషాయిగూడ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement