కర్కశత్వం.. అమానవీయం..

children torture by her mother - Sakshi

పసి పిల్లలకు ఇంట్లోనే నరకం చూపించిన తల్లి, ఆమె ప్రియుడు

వర్గల్‌(గజ్వేల్‌): కర్కశత్వం.. అమానవీయం.. నాలుగేళ్ల లోపు పసి పిల్లలు అని కూడా చూడ కుండా.. తమ అమానుష ప్రవర్తన బయటకు పొక్కకుండా.. పిల్లల కేకలు బయటకు వినప డకుండా.. నోట్లో గుడ్డలు కుక్కి.. శరీరంపై వాతలు పెట్టి.. ఒళ్లంతా హూనం చేసి, గిచ్చి, రక్కి, కాళ్లు, చేతులు విరిచి.. ప్రతి నిత్యం చిన్నారులకు నరకం చూపుతున్న తల్లి, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి దుశ్చర్య.. మానవత్వానికి మచ్చగా నిలుస్తోంది.

ఎదురు ప్రశ్నించలేని చిన్నారులను చిత్రహింసలు చేస్తున్న ఇరువురి దుర్మార్గం గ్రామస్తుల చొరవతో ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం నాచారంలో వెలుగులోకి వచ్చింది. గజ్వేల్‌ సమీపంలోని జాలిగామకు చెందిన మాచ పురం సురేశ్‌ అలియాస్‌ సురేందర్‌కు పెళ్లై భార్యను వదిలేశాడు. వర్గల్‌ మండలం తున్కిఖాల్సకు చెందిన రేణుకకు పెళ్లైంది. ఇద్దరు పిల్లలు దివ్య(4), డేవిడ్‌(రెండేళ్లలోపు బాబు) పుట్టిన తర్వాత భర్త వదిలేశాడు.

గజ్వేల్‌లోనే కూలి పని చేసుకునే రేణుకకు, మాచపురం సురేశ్‌కు పరిచయం, ఆ క్రమంలో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరవై రోజుల నుంచి సురేశ్‌ వర్గల్‌ మండలం నాచా రంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తూ, ఇక్కడే రేణుక పిల్లలతో కలసి అద్దెగదిలో ఉంటు న్నారు. రేణుక, సురేశ్‌ ఇద్దరు దంపతులనే గ్రామస్తులు భావించారు. అయితే, రోజూ ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలను వారు కొడుతున్న విషయం ఇరుగుపొరుగు గమనించినా పెద్దగా పట్టించుకోలేదు.

నోట్లో గుడ్డలు కుక్కి
నోట్లో గుడ్డలు కుక్కి పిల్లలను గిల్లడం, కాళ్లు, చేతులు మెలితిప్పడం, చేతులు కట్టేసి ఇనుప పొగ గొట్టంతో శరీరంపై వాతలు పెట్టడం, చావ బాదడం లాంటి దుష్కృత్యాలు నిత్యకృత్యమైనా అరుపులు బయటకు విన్పించే ఆస్కారం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం  వారి హింసకు తాళలేక దివ్య గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వచ్చి అమానవీయ కృత్యాలను గమ నించారు. కాళ్లు వాచి పోయి నడవలేని స్థితిలో చిన్నారి ఉంది.

దివ్య శరీరంపై వాతలు, కమిలి పోయిన గాయాలు, ముఖంపై రక్కిన గాయాలు చూసి చలించి పోయారు. ఆకలితో అల్లాడుతున్న చిన్నారిని చేరదీసి అన్నం పెట్టారు. చిన్న పిల్లాడి ఛాతిపై కమిలిన గాయం చూసి ఆవేదన వ్యక్తం చేశారు. గాయాలతో విలవిల్లా డుతున్న చిన్నారులను చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో గజ్వేల్‌ ఆసుపత్రికి తరలిం చారు.

చిన్నారులను చిత్ర హింసలకు గురి చేసిన వైనం తెలిసి గజ్వేల్‌ సీడీపీఓ వెంకట్రాజమ్మ, జిల్లా బాలల సంక్షేమ అధికారులు రాజు, శంకర్‌ నాచారం సందర్శిం చారు. వెంకట్రాజమ్మ ఫిర్యాదు మేరకు సురేశ్, రేణుకలపై కేసు నమోదు చేశామని గౌరారం ఎస్సై ప్రసాద్‌ తెలిపారు. చిన్నారులను సం రక్షణ కోసం చిల్డ్రన్‌ హోమ్‌కు తర లించను న్నట్లు  వెంకట్రాజమ్మ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top