తత్కాల్ టిక్కెట్ స్కాం: సీబీఐ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌ అరెస్ట్‌

CBI arrests its software programmer for Tatkal tickets scam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రైల్వే తత్కాల్‌ టికెట్ల  స్కాం కేసులో సీబీఐ   ఓ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌ని అరెస్ట్‌ చేసింది. ఒకేసారి వందల టికెట్లు బుక్‌  చేసే అక్రమ సాఫ్ట్‌వేర్‌  రూపొందించిన ఆరోపణలపై సీబీఐ అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌సహా, మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసింది.అక్రమ  సాఫ్ట్‌వేర్‌ సాయంతో రైల్వే తత్కాల్ రిజర్వేషన్ల వ్యవస్థ లో అక్రమాలకు పాల్పడిన ప్రోగ్రామర్ అజయ్‌ గార్గ్‌ను బుధవారం అరెస్టు చేసింది. వీరినుంచి భారీ ఎత్తున నగలు,నగదును స్వాధీనం చేసుకుంది.

మంగళవారం రాత్రి ఈ దాడులు నిర్వహించామని సీబీఐ  అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ తెలిపారు.  రూ. 89 లక్షల  నగదును, రూ.69 లక్షల  విలువైన బంగారు ఆభరణాలు రెండు బంగారు పట్టీలు(రెండు కిలోలు), 15  ల్యాప్‌ట్యాప్‌లు, 15 హార్డ్ డిస్క్‌లు, 52 మొబైల్ ఫోన్లు, 24 సిమ్ కార్డులు, 10 నోట్‌బుక్స్‌, ఆరు రౌటర్లు, నాలుగు డోంగ్లెస్, 19 పెన్ డ్రైవ్స్‌ తదితరాలను  స్వాధీనం చేసుకున్నామన్నారు. గార్గ్‌తోపాటు అతని సన్నిహితుడు అనిల్ గుప్తాను  అ రెస్టు చేసి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

2012లో సీబీఐ అసిస్టెంట్‌ ప్రోగ్రామర్‌గా  చేరిన విజయ్‌ గార్గ్‌ 2007-11 మధ్య నాలుగు సంవత్సరాల పాటు  ఐఆర్‌సీటీసీలో  పనిచేశాడు. ఈ సందర్భంగా   రైల్వే టికెటింగ్  సిస్టంలోని  లోపాలను గమనించాడు.  ఈ నేపథ్యంలోనే  కొత్త సాఫ్ట్‌వేర్‌ను సృష్టించాడు. కొంతమందితో కలిసి  కుంభకోణానికి నాంది పలికాడు.  ఈ సాఫ్ట్‌వేర్‌ను  తన అనుచరుడు అనిల్‌ గుప్తా ద్వారా కొంతమంది  ఏజెంట్లకు విక్రయించాడు. జాన్‌పూర్‌లో ఏడుగురు, ముంబైలో ముగ్గరు,  మొత్తం10మందిని గుర్తించినట్టు  సీబీఐ అధికారులు వెల్లడించారు.  దీంతో ఒక్కో ఏజెంట్‌ ద్వారా ఒకేసారి వందల తత్కాల్‌ టికెట్లను బుక్‌ చేస్తూ.. తద్వారా నిజమైన ప్రయాణీకులను  ఇబ్బందుల పాలు చేశారని చెప్పారు. బుకింగ్‌ ఏజెంట్ల ద్వారా భారీ  సంపదను కూడగట్టాడని ముఖ్యంగా బిట్‌కాయిన్స్‌, హవాలా నెట్‌వర్క్‌ ద్వారా ఈ డబ్బులను అందుకున్నట్టు సీబీఐ అధికారులు ప్రకటించారు. అంతేకాదు... ఇప్పటికీ ఐఆర్‌సీటీసీలో  లూప్‌ హోల్స్‌ ఇంకా అలానే ఉన్నాయని  వ్యాఖ్యానించడం విశేషం.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top