బంజారాహిల్స్‌లో కారు బీభత్సం.. | Car Over speed And Hits Bike One Injured In Hyderabad | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం..

Apr 15 2018 11:07 AM | Updated on Sep 4 2018 5:44 PM

Car Over speed And Hits Bike One Injured In Hyderabad - Sakshi

బోల్తాపడ్డ కారు (ఫైల్ ఫొటో)

సాక్షి, హైదరాబాద్ ‌: నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు ఢీకొనడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అప్తాబ్‌ అనే వ్యక్తి అతివేగంగా కారు నడుపుతున్నాడు. ఈ క్రమంలో తన కారుతో అదే మార్గంలో వెళ్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో బైక్ నడుపుతున్న చేతన్‌ దానియాకు గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా కారుతో అక్కడి నుంచి పరారు కావాలని నిందితుడు అప్తాబ్ యత్నించడంతో  మరో కారు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. నిందితుడు అప్తాబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement