మెల్‌బోర్న్‌లో కారు బీభత్సం | Car crashes Melbournes Flinders Street Station crowd | Sakshi
Sakshi News home page

మెల్‌బోర్న్‌లో కారు బీభత్సం

Dec 21 2017 3:01 PM | Updated on Aug 21 2018 6:00 PM

Car crashes Melbournes Flinders Street Station crowd - Sakshi

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది.

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గురువారం ఓ కారు బీభత్సం సృష్టించింది. బిజీగా ఉండే ఫ్లిండర్స్‌ స్ట్రీట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 14 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు.  వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అక్కడి అధికారులు వెల్లడించారు.

ఓ తెల్లని కారు పాదచారులపైకి దూసుకెళ్లిందని.. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు తెలిపారు. కారు బీభత్సంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. సంఘటనకు సంబంధించి కారు డ్రైవర్‌తో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే కారు డ్రైవర్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రమాదం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement