శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌: యువతి పట్ల అసభ్య ప్రవర్తన | Cab Driver Molested Shamshabad Airport Employee  | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌: యువతి పట్ల అసభ్య ప్రవర్తన

Jun 29 2019 6:10 PM | Updated on Jun 29 2019 6:42 PM

Cab Driver Molested Shamshabad Airport Employee  - Sakshi

సాక్షి, శంషాబాద్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేసే యువతి పట్ల ఓ క్యాబ్‌ డ్రైవర్‌ అసభ్యంగా ప్రవర్తించాడు. ఎయిర్‌పోర్ట్‌లో పనిచేసే 18 ఏళ్ల యువతి.. సల్మాన్‌ అనే డ్రైవర్‌ నడుపుతున్న ఇన్నోవా క్యాబ్‌ను ఎక్కింది. ఆమె వాహనంలోకి ఎక్కిన తర్వాత సల్మాన్‌లోని కామాంధుడు తన వికృతరూపం బయటపెట్టాడు. ఆ యువతి చేతులు పట్టుకొని లాగి.. అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో షాక్‌ తిన్న ఆ యువతి వెంటనే కేకలు వేసింది.  

యువతి కేకలతో భయపడిపోయిన సల్మాన్‌.. ఆమెను అక్కడే క్యాబ్‌లోంచి దింపేసి పరారయ్యాడు. బాధితురాలు ఈ ఘటనపై ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎయిర్‌పోర్టులోని సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా క్యాబ్ డ్రైవర్ సల్మాన్‌ను అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిపోయే ప్రయాణికులు పోలీసు అనుమతి ఉన్న క్యాబ్‌ల్లోనే ప్రయాణించాలని ఎయిర్‌పోర్ట్ ఏసీపీ అశోక్‌కుమార్ గౌడ్ మీడియాకు తెలిపారు.


శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద మహిళ అదృశ్యం
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరో మహిళ అదృశ్యమైంది. మస్కట్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వచ్చిన భవానీ (28) అనే మహిళ అదృశ్యమయ్యారు. భవానీని రిసీవ్ చేసుకొనేందుకు ఆమె భర్త భీమారావు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఆయన ఎంతసేపు వేచిచూసినా భార్య కనిపించలేదు. ఫోన్ చేస్తే.. స్విచ్ఛాప్‌ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన భీమారావు తన భార్య కనిపించడం లేదంటూ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎయిర్‌పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement