క్యాబ్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

Cab Driver Commits End Lives With Financial Problems Hyderabad - Sakshi

పహాడీషరీఫ్‌: లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులకు గురైన ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన మేరకు.. మల్లాపూర్‌ గ్రామానికి చెందిన పోరెడ్డి నర్సింహా రెడ్డి (39)క్యాబ్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.  లాక్‌డౌన్‌ నుంచి కారు నడవకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నాడు. ఈ సమయంలోనే ఇంటి నిర్మాణం పెట్టుకోవడం....చిట్టీలు కూడా కట్టలేని పరిస్థితి నెలకొంది. (జీవితం చావడానికి కాదు: ఐశ్వర్య )

ఈ క్రమంలోనే శనివారం రాత్రి భార్య పిల్లలతో కలిసి నిద్రించిన నర్సింహా రెడ్డి అర్ధరాత్రి గదిలో నుంచి బయటికి వచ్చి గదికి బయటి నుంచి గొళ్లెం పెట్టాడు. కొద్ది సేపటి అనంతరం నిద్రలేచిన భార్య....భర్త లేకపోవడంతో డోర్‌ తీసేందుకు ప్రయత్నించింది. బయటి నుంచి లాక్‌ చేసి ఉందని గ్రహించి స్థానికులకు ఫోన్‌ చేయడంతో వారు వచ్చి పరిశీలించగా హాల్‌లోనే తాడుతో ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు సంతానం. (సుశాంత్‌ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top