నటికి లైంగిక వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్ | Businessman Arrested In Actress Rape Case | Sakshi
Sakshi News home page

నటికి లైంగిక వేధింపులు.. వ్యాపారవేత్త అరెస్ట్

Mar 23 2018 7:33 PM | Updated on Apr 3 2019 6:34 PM

Businessman Arrested In Actress Rape Case - Sakshi

నటి జీనత్ అమన్ (ఫైల్ ఫొటో)

సాక్షి, ముంబై: నటిపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో నటిపై అఘాత్యానికి పాల్పడ్డ వ్యాపారవేత్త, గత కొన్నేళ్ల నుంచి తనకు అసభ్య ఫొటోలు పంపుతూ వేధిస్తున్నాడని జుహు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం.. బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్(68) కొన్నేళ్ల కిందట ఓ ప్రాపర్టీ కొనుగోలు కోసం వ్యాపారవేత్త సర్ఫరాజ్ అలియాస్ అమన్ ఖన్నాను సంప్రదించారు. నటి ఒక్కరే ఉండటంతో వ్యాపారవేత్త ఆమెపై లైంగిక దాడి చేశాడు. 

గత కొన్నేళ్ల నుంచి నటి అసభ్య ఫొటోలు పంపుతూ, ఆమె నుంచి డబ్బు గుంజుతున్నాడు. 2010 నుంచి ఇప్పటివరకూ రూ.15 కోట్ల మేర నగదును నటి నుంచి నిందితుడు అమన్ ఖన్నా వసూలు చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులు పేర్కొన్నారు. గతంలో రెండు పర్యాయాలు ఫిర్యాదు చేసిన నటి ఆ వ్యాపారవేత్త వేధింపులు తట్టుకోలేక ఇటీవల మరోసారి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ చేపట్టిన జుహు పోలీసులు గురువారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు. శుక్రవారం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ కేసు విచారణ క్రైమ్ బ్రాంచ్ విభాగానికి బదిలీ అయింది. ది గ్రేట్ గ్యాంబ్లర్, అజ్‌నబీ, సత్యం శివం సుందరం, కుర్బానీ తదితర చిత్రాల్లో జీనత్‌ నటించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement