ఆప్‌ నేత దారుణ హత్య! | Burnt Body Of AAP Leader Found In Car | Sakshi
Sakshi News home page

Oct 5 2018 7:29 PM | Updated on Oct 5 2018 7:30 PM

Burnt Body Of AAP Leader Found In Car - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బోప్రాలో ఓ కారుకు నిప్పంటించి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు నవీన్‌ దాస్‌(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బోప్రా ప్రాంతంలోని లోని- సహీదాబాద్‌ రోడ్డు మార్గం గుండా కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. బోప్రాలో ఓ కారుకు నిప్పంటించి ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి పోలీసులు మంటలార్పి లోపల ఉన్న వ్యక్తిని బయటికి తీసేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడు. కారు నంబరు ఆధారంగా మృతుడిని ఆప్‌ నేత నవీన్‌ దాస్‌గా గుర్తించారు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

ఇది ముమ్మాటికి ప్రత్యర్థుల పనే..!
తన సోదరుడి ఎదుగుదలను ఓర్చుకోలేకే ప్రత్యర్థులు అతడిని దారుణంగా చంపారని నవీన్‌ దాస్‌ సోదరి ఆరోపించారు. రాత్రి 12 గంటలకు ఫోన్‌ రావడంతో అతడు బయటికి వెళ్లాడని, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా నవీన్‌ దాస్‌ను కారులోకి ఎక్కించి, బయటి నుంచి లాక్‌ చేసి నిప్పంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ నవీన్‌ దాస్‌ కుటుంబాన్ని పరామర్శించారని అతడి స్నేహితులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement