బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

Btech Student Suicide When Fail In Exams Hyderabad - Sakshi

 పరీక్షలో ఫెయిల్‌ కావడమే కారణం?  

బంజారాహిల్స్‌: ఆక్సిజన్‌ సిలిండర్‌ పైపులను మెడకు చుట్టుకుని.. పాలిథిన్‌ కవర్లను ముఖానికి వేసుకొని బీటెక్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. బీటెక్‌ రెండో సంవత్సరం పరీక్షల్లో ఓ సబ్జెక్ట్‌ తప్పడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. ఫిలింనగర్‌లోని వినాయనగర్‌ బస్తీలో నివసించే పి.గణేష్‌ (19) బండ్లగూడలోని మహవీర్‌ కాలేజీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి కురుమయ్య టిప్పర్‌ డ్రైవర్‌. తల్లి రమణమ్మ పూలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో గణేష్‌ ఉంటున్న గది నుంచి తీవ్రంగా వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు గమనించి డోర్‌ కొట్టారు.

పావుగంట గడిచినా డోర్‌ తీయకపోగా అప్పటికే వాసన మరింత పెరగడంతో కిటికీలోంచి లోనికి చూడగా గణేష్‌ ఆక్సిజన్‌ సిలిండర్‌ పైపులను మెడకు చుట్టుకొని, ఓ పాలిథిన్‌ కవర్‌ను ముఖానికి వేసుకొని కనిపించాడు. అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు పగులగొట్టి గణేష్‌ను వెంటనే అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రెండు నెలల క్రితం గణేష్‌ బీటెక్‌ రెండో సంవత్సరం పరీక్ష తప్పడంతో మనస్తాపానికి గురయ్యాడని, మరోసారి పరీక్ష రాసినప్పటికీ ఫలితం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గణేష్‌ ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు నుంచే ప్రణాళిక వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితమే ఆక్సిజన్‌ సిలిండర్లను తన ఇంట్లోకి తెచ్చుకోగా వాటిని తల్లి గమనించలేదు. మృతుడి చెల్లెలు మాత్రం సిలిండర్ల గురించి ప్రశ్నించగా గణేష్‌ సమాధానం చెప్పలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మార్కులు తక్కువ వచ్చాయని మరో విద్యార్థి..
మలక్‌పేట: పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మనస్తాపంతో ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్‌స్పెక్టర్‌ కేవీ సుబ్బారావు వివరాల ప్రకారం.. గుజరాత్‌ రాజ్‌కోట్‌కు చెందిన హరీష్‌ బాయ్‌ కుమారుడు దర్శన్‌ హరీష్‌ బాయ్‌ (24) చదువు కోసం నగరానికి వచ్చి మూసారంబాగ్‌ హెగ్డే ఆస్పత్రి సమీపంలోని దీక్షత్‌ అపార్ట్‌మెంట్‌ పెంట్‌హైస్‌లో అద్దెకు ఉంటున్నాడు. గడ్డిఅన్నారంలోని ఓ విద్యాసంస్థలో గేట్‌ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. ఈ నెల 2న గేట్‌ పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం పరీక్ష ‘కీ’ పేపర్‌ చూసుకోగా తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో మనోవేదనకు గురైన అతడు ఈ నెల 15న తన గదిలోని సీలింగ్‌ హుక్కుకు బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  వాచ్‌మన్‌ మారుతి ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనునాయక్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.   గదిలో దొరికిన సూసైడ్‌ నోట్‌లో తన శవాన్ని కోయంబత్తూర్‌లోని ‘బూ యోగా’ సెంటర్‌కు అందించాలని రాసి ఉంది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top