నవవధువు ఆత్మహత్యాయత్నం | Bride Priyanka Commits Suicide In Tamil Nadu | Sakshi
Sakshi News home page

నవవధువు ఆత్మహత్యాయత్నం

May 24 2018 8:49 AM | Updated on Nov 6 2018 8:16 PM

Bride Priyanka Commits Suicide In Tamil Nadu - Sakshi

అన్నానగర్‌: చెన్నై సమీపంలో మంగళవారం వివాహం జరిగిన రెండో రోజే యువతి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చెన్నై, కేకే.నగర్‌ శివలింగపురానికి చెందిన జీవా (24). అతని పైఇంట్లో నివసిస్తున్న ప్రియాంక (21) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించారు. ఈ స్థితిలో గత 20వ తేదీన జీవా, ప్రియాంక ఇంటి నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. అనంతరం దంపతులు జీవా ఇంటికి వెళ్లారు. అతని అమ్మ కామాక్షి చెబుతూ మీరు పెళ్లి చేసుకున్న ముహూర్తం మంచిది కాదు. మూడు నెలల తరువాత బంధువులను పిలిచి వివాహం ఘనంగా జరిపిస్తానని చెప్పింది.

జీవాను ప్రియాక మెడలో ఉన్న తాళి విప్పమని చెప్పింది. దీని ప్రకారం జీవా భార్య మెడలో తాళిని విప్పాడు. తరువాత ప్రియాంకను ఆమె తల్లిదండ్రుల వద్దకు పంపారు. ఈ స్థితిలో మంగళవారం ప్రియాంక తన భర్త జీవాకు ఫోన్‌ చేసింది. అతను ఫోన్‌ తీయకపోవడంతో మనస్తాపం చెందిన ప్రియాంక ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను శరీరంపై పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె తల్లిదండ్రులు మంటలను ఆర్పి కేకేనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. 40 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను డాక్టర్లు కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. దీనిపై కేకే.నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement