ప్రేమించకుంటే చంపేస్తా..!

Boyfriend Threats to Lover on Road Tamil Nadu - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై:  తనతో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించకుంటే చంపేస్తానంటూ మాజీ ప్రేయసిని ఒక యువకుడు బెదిరించిన ఉదంతం సత్యమంగళంలో బుధవారం చోటుచేసుకుంది. ఈరోడ్‌ జిల్లా సత్యమంగళంకు చెందిన శివకుమార్‌ అదే ప్రాంతా నికి చెందిన ఓ యువతి రెండేళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ యువతి శివకుమార్‌తో మాట్లాడకుండా దూరంపెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన శివకుమార్‌ అదను కోసం వేచి చూశాడు. సత్యమంగళం పన్నారీ రోడ్డులో బుధవారం ఉదయం బస్సు కోసం వేచి ఉన్న ఆ యువతి వద్దకు వచ్చిన శివకుమార్‌ ఘర్షణకు దిగాడు. అయినా ఆమె ససేమిరా అనడంతో యువతి గొంతుపై కత్తిపెట్టి తనను ప్రేమించకుంటే హతమారుస్తానని బెదిరించా డు. ఈ సంఘటనతో బస్టాప్‌లోని వ్యక్తులు శివకుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top