ఆడుకునేందుకు పార్కుకు వెళ్లి..  | boy died in a sump | Sakshi
Sakshi News home page

ఆడుకునేందుకు పార్కుకు వెళ్లి.. 

Jan 20 2018 8:07 PM | Updated on Jul 12 2019 3:02 PM

సాక్షి, కర్నూలు: కర్నూలు నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు పార్కులోని సంపులో పడి మృతిచెందాడు. ఆడుకునేందుకు వీకర్ సెక్షన్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న నేతాజీ పార్కులోకి వరలక్ష్మి, శ్రీనివాసులు కుమారుడు తిరుమలేష్‌(10) వెళ్లాడు. అయితే అక్కడ నిర్మించిన సంపుపై మూత లేకపోవడంతో అటుగా వెళ్లిన బాలుడు అందులోపడి మృతిచెందాడు. కాగా, మునిసిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లవాడు మృతిచెందాడని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement