స్కూల్‌ బస్సు కిందపడి బాలుడు మృతి

Boy Died in Private School Bus Accident West Godavari - Sakshi

డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఫిర్యాదు

పశ్చిమగోదావరి,టి.నరసాపురం: ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు కింద పడి ఐదేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని గండిగూడెంలో శుక్రవారం జరిగింది. డ్రైవర్‌ నిర్లక్ష్యానికి తమబిడ్డ బలయ్యాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గండిగూడేనికి చెందిన కొక్కొండ కృష్ణమాచారి ఐదేళ్ల కుమారుడు కొక్కొండ పార్థ వీర ఉమాశంకర్‌ (5) ఈ సంఘటనలో మృతిచెందాడు. బొర్రంపాలెం జీఎన్‌ఆర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీకి చెందిన స్కూల్‌బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ గమనించకపోవడంతో రోడ్డుపక్కన ఉన్న బాలుడు బస్సు టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై బాలుడి తండ్రి కృష్ణమాచారి ఫిర్యాదుతో హెచ్‌సీ పి.మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top