టీచర్‌ ఇంట్లో భారీ లూటీ

Big Robbery In School Teacher House - Sakshi

లక్కోరలో 26.5 తులాల బంగారం చోరీ

తాళం వేసింది  చూసి దోపిడీ

ఐదేళ్ల తర్వాత  అదే ఇంట్లో రెండోసారి  

ఆధారాలు సేకరించిన క్లూస్‌టీం

వేల్పూర్‌:మండలంలోని లక్కోర గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎం.రాజేంద్రప్రసాద్‌రావు ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దీనిలో దుండగులు 26.5 తులాల బంగారం అపహరించారు. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ రమణారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్‌ మండలం చేపూర్‌ హైస్కూలు హెచ్‌ఎంగా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్‌రావు, భార్య శోభ తమ కూతురు డెలివరి కోసం నాలుగురోజుల కింద హైదరాబాద్‌కు వెళ్లారు. దొంగల భయం ఉండడంతో ఇంట్లో కాపలాగా పడగల్‌ గ్రామానికి చెందిన తమ బంధువుల అబ్బాయిని రాత్రిపూట పడుకోమని చెప్పారు. అత ను రెండ్రోజులు పడుకున్నాడు. మంగళవారం రాత్రి పడుకోలేదు. దాంతో దుండగులు రాత్రిపూట గేటుపై నుంచి దూకారు. ఇంటి తాళం పగులగొట్టి తులపులు ఎప్పటిలాగానే ఉంచి దోపిడీ చేశారు.

రెండు బెడ్‌రూంలలోని రెండు బీరువాలను తెరచి వాటిలోని బంగారం ఎత్తుకెళ్లారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి నేరుగా రాజేంద్రప్రసాద్‌రావు చేపూర్‌లో తాను పనిచేస్తున్న స్కూలుకు వచ్చారు. స్కూలు ముగియగానే తాళం చెవి కోసం వారి బంధువులకు ఫోన్‌ చేశాడు. బంధువుల అబ్బాయి రాగానే గేటు తీసి ఇంటి తాళం తీయబోయేసరికి అది పగిలిపోయి ఉంది. ఇంట్లోకి వెళ్లే సరికి బీరు వాలు తెరచి, వస్తువులన్ని చిందరవందరగా ఉండడంతో దొంగలు పడ్డారని గుర్తించారు. విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో ఆర్మూర్‌ రూరల్‌ సీఐ రమణారెడ్డి, వేల్పూర్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌ అక్కడికి చేరి పరిశీలించారు. క్లూస్‌టీంను రప్పించి వేలి ముద్రలు సేకరించారు. సంఘటానా స్థలాన్ని ఆర్మూర్‌ డీసీపీ శివకుమార్‌ సందర్శించారు. చోరీ వివరాలను తెల్సుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఐదేళ్ల కింద దోపిడీ ముఠా దాడి  
2013లో ఇదే ఇంటిపై అర్ధరాత్రి సుమా రు పదిమంది దుండగుల ముఠా దోపి డీ చేసింది. 63వ నంబరు జాతీయ రహదారికి సమీపంలో, గ్రామానికి దూరంగా ఉండడంతో దుండగులు సు లువుగా దోపిడీ చేశారు. తులుపులు వి రగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. వారిని ఎదిరించిన రాజేంద్రప్రసాద్‌రావుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఆ యన భార్య శోభపై నుంచి, ఇంట్లో ఉం చిన సుమారు పది తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చాలా ఏళ్లుగా దుండగుల గురించి గాలించినా, వారు పట్టుబడలేదు. చివరికి ఆ కేసును సైతం పోలీసు లు మూసివేశారు. దుండగులు మరోసా రి తన ఇంటిలో దోపిడీకి పాల్పడడంతో ఉపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్‌రావు తీవ్రంగా రోదించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top