వికలాంగుడిపై అఖిల ప్రియ అనుచరుల దాడి

Bhuma Akhila Priya Followers Beats Handicapped In Allagadda - Sakshi

సాక్షి, కర్నూలు : ఓ వికలాంగుడిపై మంత్రి భూమా అఖిల ప్రియ అనుచరులు దాడికి తెగబడ్డారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దస్తగిరి అనే వికలాంగుడిని మంత్రి అనుచరులు దాడి చేసి గాయపరిచారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నాడన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మంత్రి అఖిల ప్రియ కాన్వాయ్‌ నుంచి దిగిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన ఉన్న అతడిపై దాడి చేశారు. తనపై చాకలి శ్రీను, మార్క్‌, కే రామ్‌మోహన్‌ మరో ముగ్గురు వ్యక్తులు కలిసి దాడి చేశారని, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికి పోలీసులు పట్టించుకోకపోవటం గమనార్హం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top