అధర్మారావు! 

Attender Irregularities In Endowments Department Srikakulam - Sakshi

దేవదాయ శాఖలో అటెండర్‌ చేతివాటం

ఫోర్జరీ సంతకాలతో డీ పట్టాలు, ఉద్యోగ పత్రాలు తయారీ

కలెక్టర్, దేవదాయ ఏసీ, తహసీల్దార్‌ సంతకాలు ఫోర్జరీ

నకిలీ బాగోతాన్ని పసిగట్టి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈఓ నారాయణ

సాక్షి, శ్రీకాకుళం: చేస్తున్నది అటెండర్‌ ఉద్యోగం.. చేసేది మాత్రం కలెక్టర్‌ సంతకం. కలెక్టర్‌గానే కాదు దేవదాయ శాఖ ఏసీ, తహసీల్దార్‌ సంతకాలను కూడా ఫోర్జరీ చేసి డీ పట్టాలు, ఉద్యోగ నియామక పత్రాలను సృష్టించాడీయన. టెక్కలి దేవదాయ శాఖలో కంటింజెంట్‌ ప్రాతిపదికన అటెండర్‌గా పనిచేస్తున్న బెలమర ధర్మారావు ఫోర్జరీ బాగోతమిది. ఈయన వ్యవహారాన్ని కార్యాలయం ఈఓ వీవీఎస్‌ నారాయణ పసిగట్టి ఆదివారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. టెక్కలి మండలం భగవాన్‌పురం గ్రామానికి చెందిన బెలమర ధర్మారావు టెక్కలి దేవదాయ శాఖ కార్యాలయంలో కంటింజెంట్‌ ప్రాతిపదికన 5 వేల రూపాయల వేతనానికి అటెండర్‌గా పనిచేస్తున్నాడు. నందిగాం, మెళియాపుట్టి ప్రాంతాల్లో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం భూముల విక్రయాలపై కన్నేసిన ధర్మారావు దీనికి పక్కాగా ప్లాన్‌ వేశాడు. కార్యాలయంలో ఉన్న పత్రాలను పోలిన కొన్ని రకాల డీ పట్టాలను సృష్టించాడు. చదవండి: టీడీపీ నేత పాల వ్యాన్‌లో అక్రమ మద్యం

దీని పై కలెక్టర్‌ సంతకాలు, దేవదాయ అసిస్టెంట్‌ కమిషనర్‌ పేరుతో ఉన్న సీలు, తహసీల్దారు సంతకాలను ఫోర్జరీ చేసి కొంత మంది వ్యక్తులకు అమ్మేశాడు కూడా. వీటితో పాటు దేవదాయ శాఖలో కొన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి విజయవాడలో గల దేవదాయ కమిషనర్‌ పేరుతో నకి లీ పత్రాలను సృష్టించాడు. అయితే ధర్మారావు నకిలీ ప త్రాలు సృష్టించి వాటిని అమ్మకాలు చేశాడు తప్ప భూము లు చేతులు మారలేదు. దీంతో గత కొంత కాలంగా ఎవరికీ అనుమానం రాలేదు. అయితే ధర్మారావు కార్యాలయానికి తరచూ గైర్హాజరు కావడంతో ఈఓకు అనుమానం వచ్చి పలుమార్లు హెచ్చరించడమే కాకుండా నోటీసులు జారీ చేశారు.

ఇదే సమయంలో కొంత మంది వ్యక్తులు ధర్మారావు కోసం తరచూ కార్యాలయానికి వస్తుండడంతో ఈఓ వీవీఎస్‌ నారాయణ తనదైన శైలిలో దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం బయట పడింది. దీంతో ఈఓతో పాటు జూనియర్‌ అసిస్టెంట్‌ ఎన్‌.ఆదినారాయణ తదితరు లు హుటాహుటిన టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ధర్మారావు 10 మంది వ్యక్తులకు పట్టాలను విక్రయించి సుమారు 1 ల క్షా 40 వేల రూ పాయలు వ సూలు చేసిన ట్లు ప్రాథమికంగా తేలింది. దేవదాయ అధికారులు ఇచ్చి న ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. చదవండి: మామపై అల్లుడు బాణం..! 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top