ప్రేమజంటపై దాడి.. యువతిపై సామూహిక లైంగికదాడి | Assult on Love Couple And Molestation in Tamil Nadu | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసులో ముగ్గురి అరెస్ట్‌

Jan 22 2020 8:13 AM | Updated on Jan 22 2020 8:13 AM

Assult on Love Couple And Molestation in Tamil Nadu - Sakshi

నిందితులు ఆడైమణి, శక్తివేల్, అజిత్‌ (ఫైల్‌)

చెన్నై ,వేలూరు: వేలూరు కోటలోని పార్కులో మూడు రోజుల క్రితం ప్రేమజంటపై దాడి చేసి యువతిపై సామూహిక లైంగిక దాడి చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మంగళవారం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో వేలూరు కస్పాలోని వసంతపురానికి చెందిన ఆడైమణి(41), శక్తివేల్‌(19), అజిత్‌(19) ఉన్నారు. వీరు రోజూ గంజాయి, మత్తు పదార్థాలు సేవించి పార్కుకు వచ్చే పర్యాటకుల వద్ద దోపిడీలకు పాల్పడేవారు. పోలీసులు నిందితులను పట్టుకోవడానికి దోపిడీలకు పాల్పడుతు న్న వారి జాబితాను తయారు చేశారు.

వారిని తమదైన శైలిలో విచారించగా ముగ్గురు యువకులు దొరికారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ‘ఈ నెల 18వ తేది రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురు నిందితులు గంజాయి మత్తులో కోట పార్కులో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఓ ప్రేమ జంట కోట గాంధీ విగ్రహం వెనుక ఉన్న గేటు ఎక్కి లోనికి ప్రవేశించారు. సుమారు 200 మీట ర్ల దూరంలో చెట్టు కిందకు వెళ్లి కూర్చున్నారు. వీరిని గమనించిన నిందితులు వారిపై దాడి చేశారు. యువతి ధరించిన కమ్మలు, సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. ప్రియుడి మెడపై కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించారు. అనంతరం యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు.

నింతులపై గతంలోనే కేసులు..
ఇదిలా ఉండగా ఈ కేసులో అరెస్టయిన అజిత్, శక్తివేల్‌పై నార్త్‌ పోలీస్‌స్టేషన్‌లో పలు దారి దోపిడి కేసులున్నాయి. రెండేళ్ల నుంచే వీరు కోట పార్కుకు వచ్చే పర్యాటకుల వద్ద దోపిడీలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఆ సమయంలో శక్తివేల్, అజిత్‌లు మైనర్లు (17) కావడంతో వారిని అరెస్ట్‌ చేసేందుకు కుదరలేదని పోలీసులు తెలిపారు.

ప్రేమ జంటలకు అనుమతి నిరాకరణ..
ప్రేమజంటపై వేలూరు కోటలోని పార్కులో యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పార్కులో పోలీసులు నిఘా పెట్టారు. రాత్రి సమయాల్లో జంటలు అటువైపు రాకుండా చూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement