పెళ్లి పేరుతో శారీరకంగా ఒక్కటై.. ఆపై.. | Assistant Director Has Complaints With Police Against Her Boyfriend | Sakshi
Sakshi News home page

పెళ్లి పేరుతో వంచించాడు.. సహాయ దర్శకురాలి ఫిర్యాదు

Jul 18 2020 6:57 AM | Updated on Jul 18 2020 6:57 AM

Assistant Director Has Complaints With Police Against Her Boyfriend - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బెంగళూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచనకు పాల్పడ్డాడని సినిమా ఓ సినీ సహాయ దర్శకురాలు తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మారుతీనగరలో నివాసం ఉంటున్న 32 సంవత్సరాల సహాయదర్శకురాలికి 2018లో ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. అనంతరం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె పూర్తిగా నమ్మింది. ఈక్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. కొద్దిరోజుల అనంతరం వివాహం చేసుకోవాలని కోరగా తన అసలు నైజాన్ని బయట పెట్టాడు. (వదినతో వివాహేతర సంబంధం..ఇంటికి పిలిపించి)

ఇంట్లోవాళ్లు చూసిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే తమ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని ఇతరులతో చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.  అనంతరం సొణ్ణేనహళ్లిలో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. అవసరాలు  ఉన్నాయంటూ పలుమార్లు లక్షల రూపాయలు తీసుకున్నాడు.  ఈ ఏడాది జనవరి 12 తేదీన మరో రూ.5 లక్షలు ఇవ్వాలని కోరగా ఆమె నిరాకరించింది. ఆ తర్వాత అతను అందుబాటులోలేకుండా పోయాడు. ఫోన్‌ కూడా స్విచ్చాప్‌ చేశాడు. దీంతో బాధితురాలు బసవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. (అధ్యక్షుడు– ఉపాధ్యక్షురాలి ప్రేమపెళ్లి )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement