అధ్యక్షుడు– ఉపాధ్యక్షురాలి ప్రేమపెళ్లి  | Panchayat President And Vice President Were Married For Love In Karnataka | Sakshi
Sakshi News home page

అధ్యక్షుడు– ఉపాధ్యక్షురాలి ప్రేమపెళ్లి 

Jul 15 2020 6:31 AM | Updated on Jul 15 2020 6:32 AM

Panchayat President And Vice President Were Married For Love In Karnataka - Sakshi

నూతన జంట భీమాశంకర, రుక్మిణీ

సాక్షి, బెంగళూరు : తాలూకా పంచాయతి అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ అపురూప వివాహం కలబురిగి జిల్లా అఫ్జలపుర తాలూకాలో చోటు చేసుకొంది. టీపీ అధ్యక్షుడు  భీమాశంకర హొన్నికేరి (బీజేపీ), ఉపాధ్యక్షురాలు రుక్మిణీ జమేదార్‌ (కాంగ్రెస్‌)లు కలిసి పనిచేస్తూ ప్రేమలో పడిపోయారు. అవివాహితులే కాబట్టి పెళ్లి చేసుకుందామని నిశ్చయించుకున్నారు. పార్టీలు వేరువేరు అయినా ఆ సంగతిని పక్కనపెట్టి ఇరుకుటుంబాలను ప్రేమపెళ్లికి ఒప్పించారు. దీంతో మంగళవారం లాక్‌డౌన్‌ నిబంధనల మధ్య సరళంగా మూడుముళ్ల వేడుక జరిగింది. పలు పార్టీల నాయకులు హాజరై దీవించారు.

కర్ణాటక మంత్రికి కరోనా పాజిటివ్‌   

Advertisement
 
Advertisement
Advertisement