సామన్ల తరలింపు పేరుతో మద్యం రవాణా

Alcohol Bottles Found in Goods Vehicles Krishna - Sakshi

చెక్‌పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్న పోలీసులు

బూదవాడ(జగ్గయ్యపేట): ఇల్లు మారేందుకు సామనుల తరలింపు పేరుతో తెలంగాణ నుంచి అక్రమ మద్యం తరలిస్తూ పట్టుబడిన ఘటన మంగళవారం తెల్లవారుజామున ఇసుక చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. హైదరాబాద్‌ నుంచి పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం కోడవల్లి గ్రామానికి చెందిన జుజ్జవరపు నరసింహారావు ఇల్లు మారుతున్నామని సామన్లు వేసుకొచ్చేందుకు టాటాఏస్‌ వాహనంలో బయలుదేరాడు. చెక్‌పోస్టు వద్ద తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వాహనాల తనిఖీ చేశారు. మద్యం సీసాలను గుర్తించారు. ఆటోలో ఉన్న ఫ్రిజ్, ఇనుప బీరువాలో, వాషింగ్‌ మిషన్, అట్టపెట్టలను పరిశీలించగా ఒక్కసారిగా అవాక్కయ్యారు. సామనుల మధ్య 480 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని చిల్లకల్లు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మార్కెట్‌లో ఈ సీసాల విలువ రూ.నాలుగు లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. ఎస్‌ఐ అభిమన్యు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వాహనంలో ఉన్న అన్ని సామన్లు పాతవి కావటంతో అక్రమ మద్యం రవాణా చేసేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

అక్రమ మద్యం స్వాధీనం
మైలవరం: రాష్ట్ర సరిహద్దు నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న 400 మద్యం సీసాలు మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మైలవరం పొందుగల రోడ్డులోని వెంకటేశ్వర థియేటర్‌ సమీపంలో సీఎన్‌జీ ఆటోలో అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి ఆటోను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ ఈశ్వరరావు తెలిపారు. నిందితుల్లో ఒకరు కంకిపాడు మండలం గొలగూడేనికి చెందిన వ్యక్తి కాగా మరోకరు విజయవాడ యనమలకుదురు మసీదు సెంటర్‌కు చెందిన వ్యక్తిగా అని ఎస్‌ఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top