ఎయిర్‌హోస్టెస్‌పై పైలట్‌ లైంగిక వేధింపులు | Air India Pilot Accused Of Molesting Air Hostess After Mid-Air Fight | Sakshi
Sakshi News home page

ఎయిర్‌హోస్టెస్‌పై పైలట్‌ లైంగిక వేధింపులు

May 7 2018 10:59 AM | Updated on Aug 17 2018 6:15 PM

Air India Pilot Accused Of Molesting Air Hostess After Mid-Air Fight - Sakshi

సాక్షి, ముంబై : ఎయిర్‌ ఇండియాలో లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది. మే 4న అహ్మదాబాద్‌-ముంబై విమానంలో పైలట్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఎయిర్‌హోస్టెస్‌ సీనియర్‌ అధికారులకు తెలిపారు. పైలట్‌పై బాధితురాలు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈనెల 4న అహ్మదాబాద్‌ నుంచి ముంబై వెళుతున్న ఎయిర్‌ ఇండియా విమానంలో పైలట్‌ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

విమానం ముంబై చేరుకోగానే సహర్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు పైలట్‌పై ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు. ఎయిర్‌హోస్టెస్‌ ఫిర్యాదు మేరకు నిందితుడిపై సెక్షన్‌ 354 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఘటనపై పోలీసులతో పాటు ఎయిర్‌ ఇండియా అధికారులు సైతం అంతర్గత విచారణ చేపట్టారు. ఈ అంశం ప్రస్తుతం విచారణలో ఉండటంతో దీనిపై తామేమీ వ్యాఖ్యానించబోమని, దర్యాప్తు సజావుగా సాగేలా సహకరిస్తామని ఎయిర్‌ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement