జైల్లోనే మరో రాత్రి గడపనున్న సల్మాన్‌ | Actor Salman To Remain In Jodhpur Jail | Sakshi
Sakshi News home page

జైల్లోనే మరో రాత్రి గడపనున్న సల్మాన్‌

Apr 6 2018 11:39 AM | Updated on Apr 6 2018 11:49 AM

Actor Salman To Remain In Jodhpur Jail - Sakshi

జోధ్‌పూర్‌ : కృష్ణజింకను వేటాడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ మరో రోజు జైలులోనే గడపనున్నారు. సల్మాన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును సెషన్స్‌ కోర్టు రిజర్వ్‌లో ఉంచడంతో ఆయన శుక్రవారం రాత్రి సెంట్రల్‌ జైల్లో గడపనున్నారు. బెయిల్‌ పిటిషన్‌ విచారణ నేపథ్యంలో సల్మాన్‌ సోదరిలు అల్విర, అర్పిత, బాడీగార్డ్‌ షేరా.. సెషన్స్‌ కోర్టుకు వచ్చారు.

మరోవైపు సల్మాన్‌ సోదరులు అర్బాజ్‌ ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌ త్వరలోనే జోధ్‌పూర్‌కు రానున్నారు. 1998లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు సెషన్స్‌కోర్టు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో నిన్న రాత్రి ఆయన సెంట్రల్‌ జైల్లోనే గడిపారు. ఆయనకు 106 ఖైదీ నెంబర్‌ను కేటాయించారు. జైలు అధికారులు సల్మాన్‌కు రోటీ, పప్పు అందించగా వాటిని తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. కాగా ఇదే కేసులో సల్మాన్‌ సహ నటులు సైఫ్‌ అలీఖాన్‌, సోనాలి బింద్రే, టబూ, నీలం కొఠారిలను నిర్ధోషులుగా కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement