ఆన్‌లైన్‌ వ్యభిచారం.. యువతుల అసభ్య ఫొటోలతో! | Accuses Arrested In Vijayawada Online Prostisution Case | Sakshi
Sakshi News home page

Aug 15 2018 3:44 PM | Updated on Oct 22 2018 6:13 PM

Accuses Arrested In Vijayawada Online Prostisution Case - Sakshi

ఆన్‌లైన్‌ వ్యభిచారం పేరుతో అత్త, అల్లుడు సోషల్‌ మీడియాలో యువతుల ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తూ జీవితాలు నాశనం...

సాక్షి, విజయవాడ : కృష్ణా జిల్లా విజయవాడలో ఆన్‌లైన్‌ వ్యభిచారం ముసుగులో మోసాలు పెరిగిపోతున్నాయి. అసలే రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా చర్యలు తీసుకోని కారణంగా మరో అకృత్యం వెలుగుచూసింది. గుంటూరుకు చెందిన రాజేశ్వరి, ఆమె అల్లుడు ఇంటర్‌నెట్‌ మాధ్యమంగా చేసుకుని ఆన్‌లైన్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కొందరు యువతుల ఫొటోలు ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లలో అప్‌లోడ్‌ చేస్తూ డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతుండేవారు. 

ఈ క్రమంలో తన ఫొటోను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని ఓ బాధిత యువతి గుర్తించారు. ఆన్‌లైన్‌ వ్యభిచారానికి తాను అంగీకరిస్తున్నట్లు తెలుపుతూ కొందరు తన ఫొటోలు అప్‌లోడ్‌ చేసి వ్యాపారం చేస్తున్నారని విజయవాడకు చెందిన ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యువతుల జీవితాలతో చెలగాటం ఆడటంతో పాటు డబ్బులు వసూళ్లు చేస్తూ మోసాలకు పాల్పడుతోన్న అత్త రాజేశ్వరితో పాటు ఆమె అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ వీళ్లు 20 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement