ఏసీబీ వలలో చిక్కిన లేబర్‌ కోర్టు జడ్జీ | ACB Caught Labor Court Judge house | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో చిక్కిన లేబర్‌ కోర్టు జడ్జీ

Mar 17 2018 11:18 AM | Updated on Sep 4 2018 5:07 PM

ACB Caught Labor Court Judge house - Sakshi

వారాసిగూడలోని జడ్జి గాంధీ నివాసం

సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి లేబర్‌ కోర్టు ప్రిసైడింగ్‌ అధికారి ఇంట్లో ఏసీబీ శనివారం ఉదయం దాడులు జరిపింది. ఆదాయానికి మించి అక్రమంగా కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారనే అభియోగంతో వారాసిగూడలోని జడ్జి గాంధీ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిపారు.  హైకోర్టు అనుమతితో జడ్జి అక్రమ ఆస్తులపై దాడులు నిర్వహించారు. ప్రస్తుతం  గాంధీ జిల్లా జడ్జి క్యాడర్‌లో ఉన్నారు. ఏసీబీ అధికారులు జడ్జీపై కేసు నమోదు చేసి విచారుస్తున్నారు.  వారాసిగుడలోని జడ్జీ ఇంటితో పాటు.. నాంపల్లి, డీడీ కాలనీ, ఆంధ్ర ప్రదేశ్‌లోని కొవ్వూరులో రెండు చోట్ల, ఏలూరు, రాజమండ్రితో సహా మొత్తం 7 చోట్ల ఏకకాలంలో  ఏసీబీ దాడులు చేపట్టింది. 

Advertisement
 
Advertisement
Advertisement