ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి | 5 people died after Auto lorry colision in Samarlakota | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి

Jul 3 2018 6:59 AM | Updated on Aug 30 2018 4:17 PM

5 people died after Auto lorry colision in Samarlakota - Sakshi

సాక్షి, పెద్దాపురం(తూర్పు గోదావరి జిల్లా) : సామర్లకోట కాకినాడ ఏడీబీ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, టిప్పర్‌ ఢీ కొన్న దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారితో పాటూ నలుగురు మహిళలున్నారు. ఓ శుభకార్యం నిమిత్తం వడ్లమూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం టిప్పర్‌తో సహా లారీ డైవర్‌ పరారయ్యాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement