మతిస్థిమితం లేని బాలుడిపై లైంగిక దాడి | 3 Juveniles Molested Teen Boy Gurugram | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం లేని బాలుడిపై లైంగిక దాడి

Jun 23 2019 10:15 AM | Updated on Jun 23 2019 10:22 AM

3 Juveniles Molested Teen Boy Gurugram - Sakshi

ఓ రోజు బాలుడు ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఇంట్లోకి..

గురుగ్రామ్‌ : మతిస్థిమితం లేని బాలుడిపై ముగ్గురు బాలురు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురుగ్రామ్‌ అశోక్‌ విహార్‌లో 15ఏళ్ల మతిస్థిమితం లేని బాలుడు తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు మైనర్‌ బాలురు అతడిపై కన్నేశారు. ఓ రోజు బాలుడు ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో వారు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. అతడిని ఇంట్లోనుంచి బయటకు దూరంగా తీసుకువచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం బాలుడ్ని అక్కడే వదిలేసి పరారయ్యారు.

కొద్దిసేపటి తర్వాత గాయాలతో పడిఉన్న బాలుడ్ని గమనించిన కొందరు అతడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని గాయాలతో ఉన్న బాలుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినా లాభం లేకపోయింది. గాయం కారణంగా బాలుడు మృత్యువాత పడ్డాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement