హోటల్‌లో రూ.10 లక్షల విలువైన నెక్లెస్‌ మాయం | 10 Lakh Worth Necklace Theft In Hyderabad | Sakshi
Sakshi News home page

హోటల్‌లో రూ.10 లక్షల విలువైన నెక్లెస్‌ మాయం

Mar 7 2018 2:36 AM | Updated on Sep 4 2018 5:07 PM

10 Lakh Worth Necklace Theft In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌ : బెంగళూరుకు చెందిన ఓ మహిళ బంగారు నెక్లెస్‌ హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని కెన్స్‌ హోటల్‌లో చోరీకి గురైంది. వజ్ర వైడూర్యాలు పొదిగిన ఈ నెక్లెస్‌ విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని బాధితులు పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. బెంగళూరు మల్లేశ్వరం 8 మెయిన్‌రోడ్డు రూలా అపార్ట్‌మెంట్స్‌లో నివసించే కె.జయప్రకాశ్‌ తన కుటుంబంతో కలసి తెలిసిన వారి పెళ్లి కోసం హైదరాబాద్‌ వచ్చారు.

హోటల్‌ రూమ్‌ నంబర్‌ 204లో ఈ నెల 3న మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో దిగారు. రాత్రి 7.30కి పెళ్లికి వెళ్లేందుకు ముస్తాబవుతుండగా కప్‌బోర్డులో ఉండాల్సిన నెక్లెస్‌ కనిపించలేదు. వెంటనే హోటల్‌ నిర్వాహకుల ను అప్రమత్తం చేశారు. రాత్రి 11.30 గంటల వరకు వారు స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ క్రైం సీఐ సిబ్బందితో కలసి వచ్చి రికార్డులు పరిశీలించారు. సీసీ ఫుటేజీలు తెప్పించారు. బంజారాహిల్స్‌ పోలీసులు క్లూస్‌ టీమ్, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు సేకరించి ఆధారాలు సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement