మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ దొరకడం కలకలం రేపుతోంది.
సాక్షి, జవహర్‌నగర్: మేడ్చల్ జిల్లాలో డ్రగ్స్ దొరకడం కలకలం రేపుతోంది. ముగ్గురు విద్యార్థులు డ్రగ్స్‌తో పట్టుబడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటన జిల్లాలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతి నగర్‌లో జరిగింది.
ఇంజినీరింగ్ విద్యార్థి అరవింద్, ఐటీఐ విద్యార్థులు శ్రవణ్, హేమంత్‌ల వద్ద డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వారి వద్ద నుంచి అరకేజీ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని.. వారికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
