10వేల కంటే తక్కువకే 3 స్మార్ట్‌ఫోన్లు

Xiaomi Rival Gome To Launch 3 Smartphones Under Rs 10000 In India - Sakshi

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో చైనీస్‌ కంపెనీల హవా అంతా ఇంతా కాదు. ఎవరి చేతులో చూసిన ఒక చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కనిపించాల్సిందే అన్న చందాగా మారిపోయింది. చైనీస్‌ కంపెనీలు షావోమి, ఒప్పో, వివో, లెనోవోల సక్సెస్‌లు చూసిన తర్వాత మరో చైనీస్‌ కంపెనీ కూడా మన మార్కెట్‌లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. షావోమి ప్రత్యర్థి గోమ్‌ ఎలక్ట్రానిక్స్‌ భారత్‌లో తన ప్రొడక్ట్‌లను మెగా లాంచ్‌ చేయబోతుందని తెలిసింది. ఇప్పటికే ఈ కంపెనీకి చైనాలో 1700 స్టోర్లు ఉన్నాయి. గోమ్‌ ఎలక్ట్రానిక్స్‌, గోమ్‌ టెలికాం ఈక్విప్‌మెంట్‌కు సబ్సిడరీ. ఈ కంపెనీ హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయి ఉంది. 

తొలుత గోమ్‌ ఎలక్ట్రానిక్స్‌ రూ.10వేల తక్కువ ధరలో మూడు ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేయబోతుంది. పండుగ సీజన్‌ను క్యాష్‌చేసుకునేందుకు ఈ స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లను మల్టి బ్రాండ్‌ స్టోర్లు, ఆన్‌లైన్ల ద్వారా విక్రయించాలని ఆ కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో కూడా గోమ్‌ చర్చలు జరుపుతోంది. స్మార్ట్‌ఫోన్లను మాత్రమే కాక టెలివిజన్లు, హోమ్‌ అప్లియెన్స్‌, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్ల లాంటి కన్జ్యూమర్‌ ప్రొడక్ట్‌ కేటగిరీలను విక్రయించాలని కూడా గోమ్‌ ప్లాన్‌ చేస్తోంది. దీని కోసం మల్టి బ్రాండ్‌ స్టోర్లతో కూడా భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో శాంసంగ్‌, టీసీఎల్‌, గోద్రెజ్‌, బజాజ్‌ లాంటి కంపెనీలకు ప్రత్యక్ష పోటీ ఇవ్వనుంది. 

భారత్‌ కార్యకలాపాల కోసం 2018 మార్చిలో పీయూష్‌ పురిని గోమ్‌ ఎలక్ట్రానిక్స్‌, భారత అధినేతగా నియమించింది. పురి, అంతకముందు మూడేళ్లు అమెరికా మల్టినేషనల్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ ఇన్‌-హౌజ్‌ బ్రాండ్‌ ఇన్‌ఫోకస్‌కు దేశీయ అధినేతగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఇన్‌ఫోకస్‌ మొబైల్‌ బ్రాండ్‌ను భారత్‌లో లాంచ్‌ చేయించింది కూడా ఈయనే. ఇన్‌ఫోకస్‌ తన ఆన్‌లైన్‌ విస్తరణ మరింత విస్తృతం చేసుకోవడానికి అమెజాన్‌తో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ లైన్‌కు మరో బ్రాండ్‌ అంబాసిడర్‌గా రన్‌వీర్‌ సింగ్‌ను నియమించింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top