breaking news
InFocus
-
10వేల కంటే తక్కువకే 3 స్మార్ట్ఫోన్లు
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనీస్ కంపెనీల హవా అంతా ఇంతా కాదు. ఎవరి చేతులో చూసిన ఒక చైనీస్ స్మార్ట్‌ఫోన్ కనిపించాల్సిందే అన్న చందాగా మారిపోయింది. చైనీస్ కంపెనీలు షావోమి, ఒప్పో, వివో, లెనోవోల సక్సెస్‌లు చూసిన తర్వాత మరో చైనీస్ కంపెనీ కూడా మన మార్కెట్లోకి అడుగుపెట్టాలని చూస్తోంది. షావోమి ప్రత్యర్థి గోమ్ ఎలక్ట్రానిక్స్ భారత్‌లో తన ప్రొడక్ట్‌లను మెగా లాంచ్ చేయబోతుందని తెలిసింది. ఇప్పటికే ఈ కంపెనీకి చైనాలో 1700 స్టోర్లు ఉన్నాయి. గోమ్ ఎలక్ట్రానిక్స్, గోమ్ టెలికాం ఈక్విప్మెంట్కు సబ్సిడరీ. ఈ కంపెనీ హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంది. తొలుత గోమ్ ఎలక్ట్రానిక్స్ రూ.10వేల తక్కువ ధరలో మూడు ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయబోతుంది. పండుగ సీజన్‌ను క్యాష్చేసుకునేందుకు ఈ స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను మల్టి బ్రాండ్ స్టోర్లు, ఆన్లైన్ల ద్వారా విక్రయించాలని ఆ కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో కూడా గోమ్ చర్చలు జరుపుతోంది. స్మార్ట్ఫోన్లను మాత్రమే కాక టెలివిజన్లు, హోమ్ అప్లియెన్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ల లాంటి కన్జ్యూమర్ ప్రొడక్ట్ కేటగిరీలను విక్రయించాలని కూడా గోమ్ ప్లాన్ చేస్తోంది. దీని కోసం మల్టి బ్రాండ్ స్టోర్లతో కూడా భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. దీంతో శాంసంగ్, టీసీఎల్, గోద్రెజ్, బజాజ్ లాంటి కంపెనీలకు ప్రత్యక్ష పోటీ ఇవ్వనుంది. భారత్ కార్యకలాపాల కోసం 2018 మార్చిలో పీయూష్ పురిని గోమ్ ఎలక్ట్రానిక్స్, భారత అధినేతగా నియమించింది. పురి, అంతకముందు మూడేళ్లు అమెరికా మల్టినేషనల్ దిగ్గజం ఫాక్స్‌కాన్ ఇన్-హౌజ్ బ్రాండ్ ఇన్‌ఫోకస్‌కు దేశీయ అధినేతగా బాధ్యతలు నిర్వర్తించేవారు. ఇన్ఫోకస్ మొబైల్ బ్రాండ్‌ను భారత్‌లో లాంచ్ చేయించింది కూడా ఈయనే. ఇన్ఫోకస్ తన ఆన్లైన్ విస్తరణ మరింత విస్తృతం చేసుకోవడానికి అమెజాన్‌తో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లైన్‌కు మరో బ్రాండ్ అంబాసిడర్‌గా రన్వీర్ సింగ్‌ను నియమించింది. -
రెడ్మి 4 కి షాక్: భారీ బ్యాటరీతో టర్బో 5
న్యూఢిల్లీ: ఇన్ఫోకస్ బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా షియామి క్రేజీ ఫోన్ రెడ్ మి 4 కి షాకిచ్చే ధరలో అత్యధిక పోటీ మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. భారీ బ్యాటరీతో టర్బో 5 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. 2, 3 జీబీ ర్యామ్‌తో, 16జీబీ అంతర్గత మెమరీతో అందుబాటులోకి తెచ్చింది. ఇవి జూలై 4 నుంచి అమెజాన్‌లో లభించనున్నాయని కంపెనీ ఒక ప్రకటనలోతెలిపింది. ఇక ధరల విషయానికి వస్తే 2జీజీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 6,999, 3 జీబీ వేరియంట్ ధరను రూ .7,999గా నిర్ణయించింది. టర్బో 5 ఫీచర్లు: 5.2 అంగుళాల డిస్ప్లే 1280x720 రిజల్యూషన్ 1.25 క్వాడ్- కోర్ మీడియా టెక్ MT6737 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఆపరేటింగ్ సిస్టం 13 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం Introducing #InFocusTurbo5 that allows you to #ChargeLessDoMore, starting at just INR 6999!! Open sale: 4th July'17 only on @amazonIN pic.twitter.com/ANwc1N8jJH — InFocus India (@InFocus_IN) June 28, 2017