కార్పొరేట్ మోసాల్లో మహిళలు కూడా కింగ్లేనట | Women account for 17 per cent of corporate frauds: KPMG Survey | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ మోసాల్లో మహిళలు కూడా కింగ్లేనట

Jun 16 2016 12:33 PM | Updated on Sep 4 2017 2:38 AM

కార్పొరేట్ మోసాల్లో మహిళలు కూడా కింగ్లేనట

కార్పొరేట్ మోసాల్లో మహిళలు కూడా కింగ్లేనట

కార్పొరేట్ కంపెనీల్లో మోసాలంటే ఇప్పటివరకూ పురుషులకే సొంతం అనుకునేవాళ్లు. కానీ ఈ మోసాల్లో మహిళల శాతం కూడా నెమ్మదిగా పెరుగుతుందట.

కార్పొరేట్ కంపెనీల్లో మోసాలంటే ఇప్పటివరకూ పురుషులకే సొంతం అనుకునేవాళ్లు. కానీ ఈ మోసాల్లో మహిళల శాతం కూడా నెమ్మదిగా పెరుగుతుందట. టాక్స్, ఆడిట్, రిస్క్ మేనేజ్ మెంట్ సంస్థ కేపీఎమ్జీ వెల్లడించిన రిపోర్టులో ఈ నిగ్గుతేలని నిజాలు వెల్లడయ్యాయి. అయితే కార్పొరేట్ మోసాల్లో నేరస్తులుగా పురుషులే అగ్రస్థానంలో ఉన్నారని రిపోర్టు నివేదించింది. 2013 మార్చి నుంచి  2015 ఆగస్టు వరకూ 750 మంది ఈ మోసాలకు పాల్పడితే, వారిలో 17శాతం మంది మహిళలే ఉన్నారని పేర్కొంది. అయితే ఈ శాతం 2010లో 10శాతమేనట.

68శాతం నేరస్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటే, 59శాతం మంది భారత్ లో ఉన్నారని తెలిపింది. మోసాలకు పాల్సడే 45 శాతం మంది మహిళలు 36-45 మధ్య వయస్కులేనని రిపోర్టు నివేదించింది. అదేవిధంగా 32శాతం మంది 26-35 మధ్య వయస్కులని, ఈ శాతం గ్లోబల్ గా 14శాతమేనని పేర్కొంది. గ్లోబల్ గా పోల్చుకుంటే భారత్ లో మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడే వారు యువకులు ఎక్కువగా ఉంటున్నారని రిపోర్టు వెల్లడించింది.

జూనియర్ స్టాఫ్ లకంటే మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగులే ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారని, కేపీఎమ్ జీ తెలిపింది. ఆస్తులను తప్పుగా చూపడం, ఫైనాన్సియల్ రిపోర్టింగ్ లాంటి వాటిని మోసాలుగా ఎంచుకుంటున్నారని, సైబర్ మోసం అతిప్రధానమైన టెక్నాలజీ ఆధారిత మోసంగా ఉందని రిపోర్టు నివేదించింది. సైబర్ మోసాల హాని క్రమేపీ పెరుగుతుందని, ఆర్గనైజేషన్స్ దీనిపై ఎక్కువగా  దృష్టిసారించాలని సూచించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement