విప్రో సీఈవో జీతం పెరిగిందట | Wipro CEO Abidali Neemuchwala Gets $1.8 Million Pay Package In FY'16 | Sakshi
Sakshi News home page

విప్రో సీఈవో జీతం పెరిగిందట

May 28 2016 1:18 PM | Updated on Sep 4 2017 1:08 AM

విప్రో సీఈవో జీతం పెరిగిందట

విప్రో సీఈవో జీతం పెరిగిందట

బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం విప్రో సీఈవో అబిద్ అలీ నీముచ్ వాలా వార్షిక వేతనం వేతనం పెరిగిందట.

న్యూఢిల్లీ : బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం విప్రో సీఈవో అబిద్ అలీ నీముచ్ వాలా వార్షిక వేతనం పెరిగిందట. ఆయన ఈ ఏడాది అక్షరాల రూ.12.04 కోట్ల వేతనం పొందుతున్నారట. ఈ వేతనం అంతకముందు మాజీ సీఈవో టీకే కురియన్ కంటే ఎక్కువట. నీముచ్ వాలా బేసిక్ జీతం, అలవెన్స్ కింద రూ.5,75,85,354, కమిషన్ అండ్ వేరియబుల్ చెల్లింపుల కింద రూ.2,35,42,334లు ఇతర చెల్లింపుల కింద రూ. 3,85,51,290లు దీర్ఘకాలిక పరిహారం కింద రూ.14,22,140లను ఈ ఏడాది అందుకుంటున్నారని రెగ్యులేటరీకి విప్రో నివేదించింది. ఈ ఏడాది ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ప్యాకేజీ సైతం రూ.48.73 కోట్లకు ఎగిసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా టీసీఎస్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ జీతం సైతం రూ.25.6 కోట్లకు పెరిగి, అదనంగా స్పెషల్ బోనస్ రూ.10 కోట్లను అందుకుంటున్నారు.

2015లో గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నీముచ్ వాలా విప్రోలో చేరారు. 2016 మార్చి ఆర్థికసంవత్సరం ముగిసిన సందర్భంగా నీముచ్ వాలా 200,000 స్టాక్ అప్షన్లను పొందారు. ప్రస్తుతం విప్రో షేరు ధర రూ.545.90గా ఉంది. ఈ స్టాక్ విలువ దాదాపు రూ.10.9 కోట్లు. విప్రో మాజీ సీఈవో, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టీకే కురియన్ ప్రస్తుతం రూ.21 కోట్ల వేతనం పొందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement