breaking news
Pay Package
-
యాపిల్ కొత్త సీఈవో వచ్చేశారు.. ఎంత భారీ జీతమో తెలుసా?
టెక్ దిగ్గజం యాపిల్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. దాదాపు 15 ఏళ్ల పాటు సంస్థను నడిపించిన టిమ్ కుక్ స్థానంలో జాన్ టెర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. యాపిల్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2026 సెప్టెంబర్ 1 నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చింది. కుక్ ఇకపై సంస్థ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.యాపిల్‌లో 25 ఏళ్ల అనుభవంటెర్నస్ యాపిల్‌కు కొత్త వ్యక్తి కాదు. ఆయన 2001లో కంపెనీలో చేరారు. అంతకుముందు వర్చువల్ రీసెర్చ్ సిస్టమ్స్‌లో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి 1997లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. యాపిల్‌లో మొదట ప్రొడక్ట్ డిజైన్ బృందంలో పనిచేసిన ఆయన, ఆ తర్వాత హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టారు.2021లో టెర్నస్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. ఈ హోదాలో ఐఫోన్, ఐప్యాడ్, మాక్, యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్, యాపిల్ విజన్ ప్రో వంటి ఉత్పత్తుల హార్డ్‌వేర్ అభివృద్ధికి సంబంధించిన బృందాలను ఆయన పర్యవేక్షించారు. ముఖ్యంగా యాపిల్ ఉత్పత్తుల డిజైన్, పనితీరు, ఇంజినీరింగ్ అంశాల్లో ఆయనకు విస్తృత అనుభవం ఉంది.యాపిల్‌కు ఎనిమిదో సీఈవోయాపిల్ చరిత్రలో టెర్నస్ ఎనిమిదో సీఈవోగా నిలిచారు. 51 ఏళ్ల టెర్నస్.. వయసులో టిమ్ కుక్ కంటే సుమారు 15 ఏళ్లు చిన్నవారు. కంపెనీలో 25 ఏళ్లకు పైగా పనిచేసిన అనుభవం ఉండటంతో, యాపిల్ సంస్కృతి, ఉత్పత్తుల అభివృద్ధి, సరఫరా వ్యవస్థలపై ఆయనకు లోతైన అవగాహన ఉందని కంపెనీ భావిస్తోంది. యాపిల్ బోర్డు కూడా టెర్నస్‌ను దీర్ఘకాలిక వారసత్వ ప్రణాళికలో భాగంగానే ఎంపిక చేసింది. సంస్థ ప్రకారం ఆయనకు సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తులపై దృష్టి, నాయకత్వ సామర్థ్యం వంటి లక్షణాలు ఉన్నాయి.టిమ్ కుక్కు ఇక కొత్త బాధ్యత2011లో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన టిమ్ కుక్.. యాపిల్‌ను భారీ స్థాయిలో విస్తరించారు. ఆయన హయాంలో ఐఫోన్‌తో పాటు యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటి కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. సర్వీస్ వ్యాపారం కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం యాపిల్ మార్కెట్ విలువ సుమారు 4.5–4.6 ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది.ఇక నుంచి కుక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సంస్థకు మార్గనిర్దేశం చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలతో సంబంధాలు, ఇతర కీలక వ్యవహారాల్లో ఆయన కంపెనీకి సహకరించనున్నారు.టెర్నస్ ముందున్న అతిపెద్ద సవాలు.. ఏఐహార్డ్వేర్ ఇంజినీర్‌గా టెర్నస్‌కు మంచి పేరు ఉన్నప్పటికీ, సీఈవోగా ఆయన ముందున్న అతిపెద్ద సవాళ్లలో కృత్రిమ మేధ (AI) ఒకటి. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఓపెన్ఏఐ వంటి సంస్థలు ఏఐ రంగంలో వేగంగా దూసుకెళ్తున్న సమయంలో యాపిల్ తన ఏఐ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. సరఫరా వ్యవస్థలో మార్పులు, చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించడం, కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కూడా టెర్నస్‌కు కీలక బాధ్యతలుగా మారనున్నాయి.భారీ వేతన ప్యాకేజీసీఈవోగా టెర్నస్‌కు కొత్త వేతన ప్యాకేజీ కూడా ఆకర్షణీయంగానే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆయనకు వార్షికంగా 3 మిలియన్ డాలర్ల (సుమారు రూ.28.47 కోట్లు) జీతంతో పాటు 2027 ఆర్థిక సంవత్సరానికి లక్ష్యితంగా 55 మిలియన్ డాలర్ల (సుమారు 522.25 కోట్ల) స్టాక్ అవార్డు లభించనుంది. ఇందులో పనితీరు ఆధారిత రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు కూడా ఉన్నాయి.ఇక టెర్నస్ వ్యక్తిగత సంపద విషయానికి వస్తే.. ఆయన నెట్‌వర్త్‌ను కొన్ని నివేదికలు సుమారు 75 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.712.13 కోట్లు)గా అంచనా వేస్తున్నాయి.వ్యక్తిగత జీవితం మాత్రం గోప్యమే..యాపిల్‌లో అత్యంత ప్రభావశీలమైన ఎగ్జిక్యూటివ్‌గా ఎదిగినప్పటికీ టెర్నస్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా వరకు గోప్యంగా ఉంచుతూ వచ్చారు. ఆయన కుటుంబం, వైవాహిక జీవితం తదితర అంశాలపై బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం పరిమితంగానే ఉంది.టిమ్ కుక్ కూడా టెర్నస్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ఇంజినీర్ ఆలోచనా విధానం, ఆవిష్కర్త స్ఫూర్తి, సమగ్రతతో నాయకత్వం వహించే లక్షణాలు టెర్నస్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 25 ఏళ్లకు పైగా యాపిల్‌కు టెర్నస్ అందించిన సేవలు ఎంతో విలువైనవని కుక్ అభిప్రాయపడ్డారు.హార్డ్‌వేర్ ఇంజినీరింగ్‌లో నిపుణుడైన టెర్నస్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ఒకటైన యాపిల్‌ను ఏఐ, కొత్త తరం డివైజ్‌లు, సరఫరా వ్యవస్థలో మార్పుల దిశగా ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: లేటెస్ట్ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ డీల్.. -
ప్రపంచ కుబేరుడి ఆనంద తాండవం!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ (Elon Musk) మరింత సంపన్నుడవుతున్నాడు. కంపెనీ సీఈవోగా ఎలాన్ మస్క్‌కు దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల విలువైన గరిష్ట వేతన ప్యాకేజీకి టెస్లా వాటాదారులు ఆమోదించారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయాన్ని కంపెనీ బోర్డు ప్రకటించబడింది. ఆమోదం అనంతరం వేదికపైకి వెళ్లిన మస్క్ కంపెనీ హ్యూమనాయిడ్ రోబోట్ ‘ఆప్టిమస్’తో కలిసి నృత్యం చేస్తూ ఈ విజయాన్ని జరుపుకున్నారు.ఈ ఘట్టం టెస్లా (Tesla) భవిష్యత్తు రోబోటిక్స్, కృత్రిమ మేధస్సుతో (AI) ఎంత బలంగా ముడిపడి ఉందో సూచిస్తోంది. మస్క్ ప్రకారం.. ఆప్టిమస్ భవిష్యత్తులో తయారీ, సరఫరాలు, వ్యక్తిగత సహాయక సేవల వరకు విస్తరించగలదు. “ఇతర కంపెనీల వాటాదారుల సమావేశాలు బోరింగ్‌గా ఉంటాయ. కానీ మనవి ఎప్పుడూ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. దీన్ని చూడండి.. ఇది అద్భుతం!” అంటూ ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. టెస్లా ఇప్పుడు “కేవలం కార్ల కంపెనీ కాదు.. రోబోటిక్స్, AI ఆధారిత కొత్త యుగానికి నాంది” అని ప్రకటించారు.Tesla’s Optimus robots outperformed their fellow robot, Elon in dancing 😂pic.twitter.com/hLBnvZSPuL— SMX 🇺🇸 (@iam_smx) November 6, 2025సాటిలేని వేతన ప్యాకేజీప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాని 1 ట్రిలియన్ డాలర్ల వరకూ వేతన ప్యాకేజీని అందుకునే అవకాశాన్ని టెస్లా వాటాదారులు ఎలాన్ మస్క్‌కు కల్పించారు. వచ్చే 10 సంవత్సరాల్లో మస్క్ 878 బిలియన్ డాలర్ల విలువైన టెస్లా స్టాక్‌ను సంపాదించే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం కంపెనీ నిర్దిష్ట మైలురాళ్లను చేరుకున్నప్పుడు మాత్రమే అమలులోకి వస్తుంది.గరిష్ట వేతన ప్యాకేజీ అందుకోవాలంటే మస్క్ సాధించాల్సిన లక్ష్యాలు.. 2 కోట్ల వాహనాలు, 10 లక్షల రోబోటాక్సీలు, 10 లక్షల హ్యూమనాయిడ్ రోబోట్ల విక్రయాలు సాధించాలి. సుమారు 400 బిలియన్ డాలర్ల స్థూల లాభాన్ని కంపెనీకి ఆర్జించిపెట్టాలి. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే, టెస్లా ప్రస్తుత 1.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కనీసం 8.5 ట్రిలియన్ డాలర్ల వరకు తీసుకెళ్లాలి.నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ వంటి కొంతమంది ప్రధాన పెట్టుబడిదారులు ఈ ప్యాకేజీకి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ, టెస్లా బోర్డు దీన్ని మస్క్‌ను కంపెనీకి కట్టిపడేయడానికి అవసరమైన ప్రోత్సాహంగా భావించింది. బోర్డు అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రణాళిక టెస్లా వాటాదారులకు కూడా దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. -
మస్క్ వేతన ప్యాకేజీపై కోర్టు తీర్పు
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఇలాన్‌మస్క్ వేతన ప్యాకేజీకి సంబంధించి డెలవేర్ కోర్టు మరోసారి స్పందించింది. మస్క్‌కు అత్యధికంగా 55.8 బిలియన్ అమెరికన్ డాలర్ల(సుమారు రూ.4.6 లక్షల కోట్లు) వేతన ప్యాకేజీ ఇస్తే వాటాదారులకు అన్యాయం చేసినట్లేనని కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది.ఆ ప్యాకేజీకి మస్క్ అనర్హుడుఇలాన్మస్క్ షేర్లు, నగదు, ఇతర అలవెన్స్‌ల రూపంలో 2018లో 55.8 బిలియన్ డాలర్లు వేతనాన్ని తీసుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక వేతన ప్యాకేజీ. ఈ ప్యాకేజీ విధానాన్ని వ్యతిరేకిస్తూ రిచర్డ్ టోర్నెట్టా అనే కంపెనీ వాటాదారు డెలవేర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత మొత్తంలో వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను దుర్వినియోగం చేయడమేనని తన ఫిర్యాదులో తెలిపారు. కంపెనీ డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చి నిబంధనలకు విరుద్ధంగా తాను ఈ ప్యాకేజీ పొందారని చెప్పారు. ఈ వ్యవహారంపై కోర్టు గతంలో స్పందించి అంత ప్యాకేజీకి మస్క్ అనర్హుడని పేర్కొంది.పిటిషన్ తోసిపుచ్చిన కోర్టుడెలవేర్ కోర్టు గతంలో తానిచ్చిన తీర్పును తాజాగా సమర్థించుకుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో తిరిగి మస్క్ ప్యాకేజీపై నిర్ణయం తీసుకున్నారు. షేర్ హోల్డర్లకు ఓటింగ్ ఏర్పాటు చేసి గతంలో మాదిరి 55.8 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం పొందారు. ఇది గత తీర్పునకు వ్యతిరేకంగా ఉండడంతో తాజాగా కోర్టు స్పందించింది. అయితే, ముందుగా వెలువడిన తీర్పునకు బదులుగా మస్క్ పిటిషన్ దాఖలు చేశారు. వాటాదారుల ఓటింగ్‌ను పరిగణించి తనకు వేతన ప్యాకేజీను ఆమోదించాలనేలా తీర్పును సవరించాలని కోరారు. కానీ కోర్టు తన పిటిషన్‌ను తోసిపుచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే..మస్క్ ఏమన్నారంటే..డెలవేర్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై మస్క్ స్పందించారు. ‘కంపెనీ నిర్ణయాలు, ఓటింగ్‌పై నియంత్రణ సంస్థ అధికారులు, వాటాదారులకే ఉండాలి. ఈ వ్యవహారం న్యాయమూర్తులకు అవసరం లేదు’ అన్నారు. టెస్లా సంస్థ దీనిపై స్పందింస్తూ కోర్టు తీర్పును పైకోర్టులో అప్పీల్ చేస్తామని చెప్పింది. -
భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈవో ప్యాకేజీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఆర్థిక పరిహారం 63% పెరిగి 79.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.665 కోట్లు) చేరుకుంది. ఈ మేరకు తాజా ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.సత్య నాదెళ్ల ప్యాకేజీ ఈ స్థాయిలో పెరగడానికి ఆయన స్టాక్ అవార్డులు సహాయపడ్డాయి. 2023లో ఆయన 48.5 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. ఇందులో స్టాక్ అవార్డుల విలువ 39 మిలియన్ డాలర్లు. 2024లో సత్య నాదెళ్ల స్టాక్ అవార్డుల రూపంలో సంపాదించినది 71 మిలియన్ డాలర్లు.జూన్‌తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 31.2% లాభపడ్డాయి. కంపెనీ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లు దాటింది. సత్య నాదెళ్ల ప్యాకేజీ భారీగా పెరిగినప్పటికీ ఆయన నగదు ప్రోత్సాహకం మాత్రం సగానికి తగ్గింది. గతంలో 10.7 మిలియన్ డాలర్లకు అర్హత పొందిన ఆయన అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా 5.2 మిలియన్ డాలర్లకు తగ్గించుకోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ నుంచి ఎక్కువగా వెళ్లిపోతున్నది మహిళలే..ఇక ఇతర హై-ప్రొఫైల్ టెక్ బాస్‌లలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023లో 63.2 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఏఐ-చిప్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 2024 ఆర్థిక సంవత్సరంలో 34.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. -
రూ.4.5 లక్షల కోట్లు భారీ వేతన ప్యాకేజీలో.. మస్క్‌కు ఎదురు దెబ్బ
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్‌కు చెల్లించే భారీ వేతన ప్యాకేజీ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీని ఇవ్వొద్దంటూ టెస్లా షేర్ హోల్డర్లు తమని కోరినట్లు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ తెలిపింది. ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్ అనేది కార్పొరేట్ కంపెనీల్లో జరిగే కార్యకలాపాల్లో షేర్ హోల్డర్లకు సహాయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం టెస్లాలో షేర్ హల్డర్ల తరుపున పనిచేస్తోంది. మార్కెట్ విలువను పెంచిఅయితే, ఎలోన్ మస్క్ తన అసాధారణమైన ప్రతిభతో టెస్లా మార్కెట్ విలువను కేవలం 10 ఏళ్ల కాలంలో అన్యూహ్యంగా పెంచారని, 2018లో తొలిసారి మార్కెట్ విలువ 650 బిలియన్ డాలర్లకు చేర్చారని టెస్లా బోర్డు డైరెక్టర్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు టెస్లా బోర్డు డైరెక్టర్లు ఏడాదికి 55 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందిస్తూ ఆమోదం తెలిపారు. వేతనాన్ని అందించారు.రూ.4.5 లక్షల కోట్ల వేతనం దండగదీనిని వ్యతిరేకిస్తూ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా టెస్లా వాటాదార్లలో ఒకరైన రిచర్డ్ టోర్నెట్టా.. డెలావర్ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా.. షేర్ హోల్డర్లు మస్క్‌కు అంత ప్యాకేజీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్లాస్ లూయిస్‌కు ప్రతిపాదనలు పంపారు. తాజా షేర్ హోల్డర్ల నిర్ణయంతో టెస్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. అంత ప్యాకేజీ.. అందుకు మస్క్ అనర్హుడేగతంలో టెస్లా షేర్ హోల్డర్ రిచర్డ్ టోర్నెట్టా పిటిషన్‌పై డెలావర్ కోర్టు విచారణ చేపట్టింది. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలోన్ మస్క్ అనర్హుడని డెలావేర్ కోర్టు న్యాయమూర్తి కేథలీన్ మెక్కార్మిక్ ఆదేశాలిచ్చారు.అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త, తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతోనే అంత మొత్తం చెల్లించామని టెస్లా డైరెక్టర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. -
ఎయిర్‌ఫోర్స్‌తో ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ ఒప్పందాలు
ముంబై: ప్రభుత్వరంగ ఎస్బీఐ, పీఎన్బీ, బీవోబీ భారత వాయుసేన (ఇండియన్ ఎయిర్‌ఫోర్స్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌తో ‘డిఫెన్స్ వేతన ప్యాకేజీ’ ఒప్పందం చేసుకున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఈ ఒప్పందం కింద ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగులు, పదవీ విరమణ తీసుకున్న వారికి ఎస్బీఐ పలు ప్రయోజనాలు, ఫీచర్లతో ఉత్పత్తులను ఆఫర్ చేయనుంది. వ్యక్తిగత ప్రమాద బీమా, వాయు ప్రమాదం, విధుల్లో మరణిస్తే అదనపు పరిహారంతో బీమా రక్షణను అందించనున్నట్టు తెలిపింది. శాశ్వత/పాక్షిక అంగవైకల్య కవరేజీ కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ‘‘మన జాతి, పౌరుల రక్షణ కోసం వైమానిక దళ ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్నాం. డిఫెన్స్ శాలరీ స్కీమ్ కింద వారికంటూ ప్రత్యేకమైన పరిష్కారాలు అందించడాన్ని కొనసాగిస్తాం’’అని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా ప్రకటించారు. ఈ ప్రయోజనాలు డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ పరిధిలో ఉన్న ఖాతాదారులకు ఆటోమేటిగ్గా లభిస్తాయని ఎస్బీఐ తెలిపింది. -
సాఫ్ట్ బ్యాంక్ సీవోవో జీతం ఎంతో తెలుసా?
టోక్యో: ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారతీయుల హవా కొనసాగుతోంది. జపాన్‌కు చెందిన టెలీ కమ్యూనికేషన్స్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ అధ్యక్షుడు, సీవోవో నికేష్ అరోరా (48) ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 5వందలకోట్ల భారీ వేతనంతో మరోసారి తన సత్తాను చాటుకున్నారు. మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 73 మిలియన్ డాలర్ల పే ప్యాకేజీ తో వరుసగా రెండవసంవత్సరం కూడా వరల్డ్ టాప్ పెయిడ్ ఎగ్జిక్యూటివ్ గా అవతరించారు. ఇప్పటికే జపాన్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న అరోరా ఈ స్పెషల్ ప్యాకేజ్ తో అత్యధిక పారితోషికాన్ని అందుకుంటున్న టెక్ దిగ్జజాలు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ , వాల్ట్ డిస్నీ యొక్క బాబ్ ఇగెర్ సరసన చేరారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి సాఫ్ట్వేర్ సంస్థలు అధిపతులుగా భారతీయులు ఉన్నత స్థానాల్లో అత్యధిక వేతనాలు పొందుతూ రికార్డు సృష్టించారు. కాగా 2014 ఆర్థిక సంవత్సరానికి 13.5 కోట్ల డాలర్ల వేతనాన్నిఅందుకున్నఅరోరా గతంలో గూగుల్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. నికేష్ అరోరా ఆధ్వర్యంలోనే సాఫ్ట్ బ్యాంక్ భారత్ లో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
విప్రో సీఈవో జీతం పెరిగిందట
న్యూఢిల్లీ : బెంగళూరుకు చెందిన ఐటీ దిగ్గజం విప్రో సీఈవో అబిద్ అలీ నీముచ్ వాలా వార్షిక వేతనం పెరిగిందట. ఆయన ఈ ఏడాది అక్షరాల రూ.12.04 కోట్ల వేతనం పొందుతున్నారట. ఈ వేతనం అంతకముందు మాజీ సీఈవో టీకే కురియన్ కంటే ఎక్కువట. నీముచ్ వాలా బేసిక్ జీతం, అలవెన్స్ కింద రూ.5,75,85,354, కమిషన్ అండ్ వేరియబుల్ చెల్లింపుల కింద రూ.2,35,42,334లు ఇతర చెల్లింపుల కింద రూ. 3,85,51,290లు దీర్ఘకాలిక పరిహారం కింద రూ.14,22,140లను ఈ ఏడాది అందుకుంటున్నారని రెగ్యులేటరీకి విప్రో నివేదించింది. ఈ ఏడాది ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సిక్కా ప్యాకేజీ సైతం రూ.48.73 కోట్లకు ఎగిసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా టీసీఎస్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ జీతం సైతం రూ.25.6 కోట్లకు పెరిగి, అదనంగా స్పెషల్ బోనస్ రూ.10 కోట్లను అందుకుంటున్నారు. 2015లో గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నీముచ్ వాలా విప్రోలో చేరారు. 2016 మార్చి ఆర్థికసంవత్సరం ముగిసిన సందర్భంగా నీముచ్ వాలా 200,000 స్టాక్ అప్షన్లను పొందారు. ప్రస్తుతం విప్రో షేరు ధర రూ.545.90గా ఉంది. ఈ స్టాక్ విలువ దాదాపు రూ.10.9 కోట్లు. విప్రో మాజీ సీఈవో, ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టీకే కురియన్ ప్రస్తుతం రూ.21 కోట్ల వేతనం పొందుతున్నారు.


