మేం కూడా రేట్లు పెంచుతున్నాం : జియో

We Are Also Raising Rates: Jio - Sakshi

సాక్షి, ముంబై : ఒకవైపు అధిక పన్నుల చెల్లింపు, మరోవైపు జియో రాకతో భారత టెలికాం పరిశ్రమలోని ఇతర నెట్‌వర్క్‌ కంపెనీలైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌- ఐడియా కంపెనీలు ఆర్ధికంగా తీవ్ర నష్టాలకు గురయ్యాయి. ఒక రకంగా టెలికాం పరిశ్రమలో సంక్షోభం తలెత్తే పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ సూచనల ప్రకారం డిసెంబర్‌ నుంచి చార్జీలు పెంచుతామని ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వరుసలో జియో కూడా పయనిస్తోంది.

ఇప్పటివరకు అత్యంత చౌకగా కాల్స్‌, డాటా సౌకర్యాన్ని ఇచ్చిన జియో కూడా చార్జీలను పెంచనుంది. ఈ మేరకు జియో కంపెనీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సూచనల ప్రకారం పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తాము కూడా చార్జీలను పెంచుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే వినియోగదారులపై అధిక భారం పడకుండా చూసుకుంటామని తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top