1 జీబీ రీచార్జ్ చేస్తే 10జీబీ
రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లకు పోటీగా వొడాఫోన్ ఇండియా సైతం ఓ నూతన ఆఫర్‌ను ప్రకటించింది. 1జీబీ డేటాకే 10 జీబీ డేటా పొందవచ్చు.
వొడాఫోన్ 4జీ నూతన ఆఫర్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లకు పోటీగా వొడాఫోన్ ఇండియా సైతం ఓ నూతన ఆఫర్‌ను ప్రకటించింది. 1జీబీ డేటాకే 10 జీబీ డేటా పొందవచ్చు. నూతన స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న వొడాఫోన్ కస్టమర్లు 4జీ డేటాను 1జీబీ రీచార్జ్ చేసుకుంటే అదనంగా 9జీబీ లభిస్తుందని వొడాఫోన్ ఇండియా తెలిపింది. అలాగే, వొడాఫోన్ ప్లేలో టీవీ, మూవీస్, మ్యూజిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుందని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. అయితే, ఈ ఆఫర్ అందుకోవాలంటే... ఓ చిన్న షరతు కూడా ఉంది. నూతన 4జీ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండాలి.
పైగా గత ఆరు నెలల్లో దానిని వొడాఫోన్ నెట్‌వర్క్ కింద వాడి ఉండరాదు. 4జీ హ్యాండ్‌సెట్ యూజర్లు వొడాఫోన్ సూపర్ నెట్ అనుభవాన్ని చవి చూసేందుకు ఈ ఆఫర్ ప్రోత్సాహకరంగా ఉం టుందని వొడాఫోన్ ఇండియా డెరైక్టర్ సందీప్ కటారియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వొడాఫోన్ తాను సొంతంగా 3జీ/4జీ సేవలు అందిస్తున్న సర్కిళ్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు మూడు నెలల పాటు 4జీ డేటా, కాల్స్‌ను అపరిమితంగా వాడుకునేందుకు రిలయన్స్ జియో అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే.


