లగ్జరీ లైఫ్‌ అంటే మాల్యాదే : గోల్డెన్‌ టాయిలెట్‌

Vijay Mallyas London Mansion Has A Golden Toilet - Sakshi

ముంబై : దేశీయ బ్యాంకులకు ఎన్నికోట్లు ఎగ్గొడితే ఏమిటి.. లగ్జరీ లైఫ్‌ అంటే అతనిదే అని చెప్పుకోవచ్చు. ఫార్ములా వన్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌ టీమ్‌ వంటి అంతర్జాతీయ స్పోర్ట్స్‌ ఈవెంట్లలో అతను చేసే హడావుడి అంతాఇంతా కాదు. ప్రపంచంలో అత్యంత అరుదైన వస్తువులుగా చెప్పుకునే మహాత్మాగాంధీ గ్లాసెస్‌, టిప్పు సుల్తాన్‌ కత్తిలను తన వశం చేసుకున్నాడు. అతనెవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. అతనే దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో లగ్జరీ లైఫ్‌ గడుపుతున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా. అతని లగ్జరీ లైఫ్‌ ఇంతే అనుకున్నారా? వింటే మీరే షాకైపోతారట. లండన్‌లో మాల్యాకు ఓ లగ్జరీ ఇల్లు ఉండిందని తెలిసింది.  ఆ ఇంట్లో గోల్డెన్‌ టాయిలెట్‌ను మాల్యా కలిగి ఉన్నారని రిపోర్టులు వెలువడుతున్నాయి. 

ఓ వైపు మాల్యా వ్యాపారాలు కుదేలు అవుతున్నా.. మరోవైపు భారతీయ అథారిటీలు అతన్ని ఎలాగైనా భారత్‌కు తీసుకొచ్చి జైలులో పెట్టాలని ప్రయత్నిస్తున్నా.. తాను మాత్రం లండన్‌ ఇంటిలో లగ్జరీ లైఫ్‌తో ఎంజాయ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంట్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ వస్తువులున్నట్టు రిపోర్టు తెలిపింది. రచయిత జేమ్స్‌ క్రాబ్‌ట్రీకి ఒకసారి విజయ్‌మాల్యా ఇంటిని సందర్శించే అవకాశం వచ్చినప్పుడు, మాల్యా ఇంట్లో ఉన్న గోల్డెన్‌ టాయిలెట్‌ను చూశారని తాజా రిపోర్టు పేర్కొంది. జేమ్స్‌, లీ కౌన్ యూ స్కూల్ అసోసియేట్‌ ప్రొఫెసర్‌. ఈ విషయాన్ని జేమ్స్‌ ఈ వారంలో ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌లో కూడా చెప్పారని రిపోర్టు వెల్లడించింది. లండన్‌లోని రీజెంట్స్‌ పార్క్‌లో ఉన్న మాల్యా భవంతిని తాను సందర్శించానని, ఆ భవంతిని, దానిలో ఉన్న లగ్జరీ వస్తువులను చూసిన తర్వాత తాను ఒక్కసారిగా ఈ ప్రపంచాన్నే మర్చిపోయినట్టు జేమ్స్‌ చెప్పారు. అక్కడే గోల్డెన్‌ రిమ్‌తో ఉన్న గోల్డెన్‌ టాయిలెట్‌ కనిపించిందని పేర్కొన్నారు. అయితే ఆ భవంతిలో గోల్డెన్‌ టాయిలెట్‌ ఉన్నప్పటికీ, గోల్డెన్‌ టాయిలెట్‌ పేపర్‌ లేదన్నారు. ఇలా విజయ్‌ మాల్యా గోల్డెన్‌ టాయిలెట్‌ విషయం బయటకి వచ్చింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top