శ్రీసిటీలో వెర్మీరియన్ యూనిట్ ప్రారంభం | Vermeiren's Sri City facility goes on stream | Sakshi
Sakshi News home page

శ్రీసిటీలో వెర్మీరియన్ యూనిట్ ప్రారంభం

Oct 8 2016 2:09 AM | Updated on Sep 4 2017 4:32 PM

శ్రీసిటీలో వెర్మీరియన్ యూనిట్ ప్రారంభం

శ్రీసిటీలో వెర్మీరియన్ యూనిట్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసిటీలో శుక్రవారం బెల్జియం దేశానికి చెందిన వెర్మీరియన్ ఇండియా యూనిట్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు.

శ్రీసిటీ(సత్యవేడు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసిటీలో శుక్రవారం బెల్జియం దేశానికి చెందిన వెర్మీరియన్ ఇండియా యూనిట్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆస్పత్రి పరికరాల తయారీలో పేరుగాంచిన వెర్మీరియన్ గ్రూప్ భారతదేశంలో మొట్టమొదట ఉత్పాదక కేంద్రాన్ని శ్రీసిటీలో ప్రారంభించింది. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ కంపెనీ ఉత్పత్తుల్లో ప్రధానమైనవి వీల్‌చైర్లని, ఆస్పత్రులు, వికలాంగులు మాత్రమే కాకుండా వయస్సు మీరిన వారికి కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పారు.

వెర్మీరియన్ గ్రూప్ సీఈవో పాట్రిక్ వెర్మీరియన్ మాట్లాడుతూ రూ. 40వేల కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చే శామని, ప్రపంచంలో ఇది నాలుగో ఉత్పత్తి కేంద్రమని తెలిపారు. ఇండియా తమకు చాలా ముఖ్యమైన వ్యాపార కేంద్రమని, ఇక్కడ తక్కువ ధరలకు ఉత్పత్తులు అందిస్తామని చెప్పారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ ఈ కంపెనీ ఏర్పాటుతో తక్కువ ధరతో నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని విశ్వసిస్తున్నానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement