టెల్కోలకు భారీ జరిమానా : జియోకు ఎంతంటే?

Trai slaps fines on Jio, Airtel, others for not meeting quality norms - Sakshi

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) దేశీయ  టెలికాం దిగ్గజాలకు మరోసారి షాక్‌ ఇచ్చింది.  వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడంలో లోపాల కారణంగా   భారతి ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌,  ఐడియా కంపెనీలకు ట్రాయ్‌ భారీ జరిమానా విధించింది. వివిధ  సేవల్లో నిర్దేశిత నాణ్యతా ప్రమాణాల నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుందని పీటీఐ  నివేదించింది.

 2017, అక్టోబరు 1 నుంచి సేవల (QoS) ప్రమాణాలను  నిబంధనలను కఠినతరం చేసిన  రెగ్యులేటరీ జనవరి-మార్చిలో సేవాల లోపాలకు సంబంధించి ఈ పెనాల్టీ విధించింది.  ముఖ్యంగా  టెలికాం మార్కెట్‌ సంచలనం ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని  రిలయన్స్‌ జియోకు రూ.34 లక్షలు భారీ జరిమానా విధించింది. అలాగే  భారతి ఎయిర్‌టెల్‌కు  రూ.11 లక్షలు  ఐడియా సెల్యులార్‌కు రూ.12.5 లక్షలు, వొడాఫోన్‌ ఇండియాకు రూ.4 లక్షల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసింది. అయితేతాజా జరిమానాపై టెల్కోలు  ఇంకా స్పందించాల్సి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top