ఆ కంపెనీలకు షాక్‌: కొత్త స్మార్ట్‌ టీవీలు వచ్చేశాయ్‌

Thomson Launches 3 Smart TV Models in India - Sakshi

షావోమి, వూ, మైక్రోమ్యాక్స్‌లకు దీటుగా థామ్సన్‌

43 అంగుళాల 4కే  యూహెచ్‌డీ థామ్సన్ టీవీ ధర రూ. 27.999

40అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ  ధర రూ.19,990

32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ. 13,490

సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి థామ్సన్ టీవీలు వచ్చేశాయ్‌.. ముఖ్యంగా  స్మార్ట్‌టీవీ సెగ్మెంట్‌లోకి చైనా కంపెనీ షావోమి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో థామ్సన్‌  సరికొత్త రీఎంట్రీ ప్రాధాన్యతను సంతరించుకుంది.  స్మార్ట్ ఎఫ్‌హెచ్‌డీ టీవీలను భారత టీవీ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది.  గురువారం 40, 43, 32 అంగుళాల  మూడు స్మార్ట్‌ టీవీలను ప్రారంభించింది.  ఫ్లిప్‌కార్ట్‌లో శుక్రవారం విక్రయాలు మొదలు కానున్నాయని కంపెనీ  వెల్లడించింది.   43 అంగుళాల 4కే  యూహెచ్‌డీ థామ్సన్ టీవీ  ధరను 27,999రూపాయలుగానూ, 40అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 19,990 రూపాయల ధర ట్యాగ్‌ను, 32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ రూ. 13.490గా నిర్ణయించింది.

43 అంగుళాల 4కే యేహెచ్‌డీ టీవీ
మోడల్ పేరు 43టీఎం4377 : 3840x2160 పిక్సల్స్ రిజల్యూషన్ హెచ్‌డీఆర్‌, విత్‌ ఎల్‌ జీఐపీఎస్‌  ప్యానెల్‌ , ఆండ్రాయిడ్‌ 4.4.4 కిట్ కాట్‌,  1.4GHz డ్యూయల్ కోర్ కార్టెక్స్- ఏ53 ప్రాసెసర్‌, అలాగే  మాలి-టీ720 జీపియూ,  1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌,   10వాట్స్‌ రెండు స్పీకర్లు, వై ఫై  కనెక్టివిటీ

40అంగుళాల థామ్సన్ స్మార్ట్‌ టీవీ
 40టీఎం4099   మోడల్‌ , 1920x1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌,  ఆండ్రాయిడ్‌ 5.1.1 లాలిపాప్‌, కార్టిక్స్- ఏ53 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్‌,  8జీబీ స్టోరేజ్‌ , 10 వాట్స్‌ రెండు స్పీకర్లు, వై ఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లు

 32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ
 32ఎం3277 మోడల్‌: 1366x768 పిక్సల్స్ రిజల్యూషన్‌,  450 నిట్స్‌ ,  ఆండ్రాయిడ్‌ 5.1.1 కార్టిక్స్-ఏ53 ప్రాసెసర్‌,  1 జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌, 20వాట్స్‌ టోటల్‌ ఆడియో అవుట్‌పుట్‌, వైఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి.

కాగా ఫ్రాన్స్‌కు చెందిన బిజినెస్ ఫ్రాన్స్‌, టెక్నిక‌ల‌ర్ ఎస్ఏ ఫ్రాన్స్ ల ఉమ్మ‌డి క‌న్‌జ్యూమ‌ర్ ఎల‌క్ట్రానిక్ బ్రాండే థామ్స‌న్‌.  యురోపియ‌న్ మార్కెట్‌లో థామ్స‌న్‌  స్మార్ట్ టీవీలను విక్రయిస్తోంది. తాజా  వ్యూహంతో  తక్కువ ధరకే స్మార్ట్ టీవీల‌తో భారత మార్కెట్‌లో పాగా వేయనుంది. తద్వారా దేశంలో మైక్రోమ్యాక్స్, వూ, షావోమి  లాంటి బడ్జెట్‌ ధరల్లో టీవీలను అందిస్తున్న కంపెనీలకు భారీ షాకే ఇవ్వనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top