breaking news
Thomson
-
స్మార్ట్ టీవీ కొనుగోలుదారులకు చేదువార్త!
దేశంలో మరోసారి టీవీల ధరలకు రెక్కలు రానున్నాయి. కొద్ది నెలల క్రితమే సరుకు రవాణా ఖర్చులు, నిర్వహణ వ్యయం భారం కారణంగా ఏప్రిల్ నెలలో టీవీ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. మళ్లీ లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లో ప్యానెల్స్ ఖర్చు పెరగడంతో ఎల్ఈడీ టెలివిజన్ల ధరలు ఈ నెలలో 3-4 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు. ఒకవేల ధరలు పెంచితే గత మూడు నెలల్లో టీవీ ధరల పెంపు ఇది రెండవ సారి కానుంది. పానాసోనిక్, హైర్, థామ్సన్ వంటి బ్రాండ్లు ఎల్ఈడీ టెలివిజన్ల ధరలను పెంచాలని ఆలోచిస్తున్నాయి. పానాసోనిక్ కమోడిటీ ధరల పెరుగుదలకు అనుగుణంగా "మేము 3 నుంచి 4 శాతం ఉత్పత్తుల ధరలను పెంచాలని చూస్తున్నాము" అని భారతదేశం & దక్షిణాసియా అధ్యక్షుడు, సీఈఓ మనీష్ శర్మ తెలిపారు. హైర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా మాట్లాడుతూ.. ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. "భారతదేశంలో ఎక్కువగా విక్రయించే 32 అంగుళాల ప్యానెల్ ధరలు, 42 అంగుళాల వంటి పెద్ద స్క్రీన్ సైజులు(వంటివి) ధరల పెరుగుదలపై తయారీదారులు ఆలోచించాల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు. హైర్ కూడా జూన్ 20 నుంచి ధరలను 3 - 4 శాతం పెంచనున్నట్లు ప్రకటించాయి. ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్, యుఎస్ ఆధారిత బ్రాండ్ కొడాక్, సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రయివేట్ లిమిటెడ్(ఎస్పీపీఎల్) రాబోయే రోజుల్లో రూ.1,000-2,000 పెంచనున్నట్లు తెలిపాయి. "అంతర్జాతీయ, దేశీయ సరుకు రవాణా ఛార్జీల ధరలు ఇప్పుడు(ఒక) ఆల్ టైమ్ గరిష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా, ప్యానెల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి" అని ఎస్పీపీఎల్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అతని ప్రకారం, 40 అంగుళాలు అంతకంటే ఎక్కువ స్క్రీన్ పరిమాణాల గల టీవీ ఓపెన్ సెల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 3 శాతం పెరిగాయి. చదవండి: వన్ ప్లస్ సంచలన నిర్ణయం.. ఒప్పోలో విలీనం -
ఏప్రిల్ 1 విడుదల... ధర దడ
న్యూఢిల్లీ: ఎల్ఈడీ టీవీల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఏప్రిల్ నుంచి ఈ వడ్డింపు ఉండనుంది. ఓపెన్–సెల్ ప్యానెళ్లు ఖరీదు కావడమే ఇందుకు కారణం. గత నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ప్యానెళ్ల ధర 35 శాతం వరకు అధికమైందని కంపెనీలు అంటున్నాయి. వచ్చే నెల నుంచి టీవీల ధరలు పెంచాలని ప్యానాసోనిక్, హాయర్, థామ్సన్ భావిస్తున్నాయి. ఇప్పటికే ఎల్జీ ఈ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తంగా 5–7 శాతం ధర పెరిగే చాన్స్ ఉంది. టీవీ స్క్రీన్ తయారీలో ఓపెన్–సెల్ ప్యానెల్ అత్యంత కీలక విడిభాగం. మొత్తం ధరలో దీని వాటాయే అధికంగా 60% వరకు ఉంటుంది. కంపెనీలు టెలివిజన్ ప్యానెళ్లను ఓపెన్–సెల్ స్థితిలో దిగుమతి చేసుకుంటాయి. చైనా సంస్థలే ఓపెన్–సెల్ తయారీ రంగాన్ని శాసిస్తున్నాయి. ఇక అప్లయెన్సెస్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్‌లో టీవీలదే అగ్రస్థానం. దేశంలో ప్రస్తుతం ఏటా 1.7 కోట్ల టీవీలు అమ్ముడవుతున్నాయి. వీటి విలువ రూ.25,000 కోట్లు. 2024–25 నాటికి మార్కెట్ 2.84 కోట్ల యూనిట్లకు చేరుతుందని సియామా, ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ అంచనా. మరో మార్గం లేకనే..: ప్యానెళ్లు ప్రియం అవుతూనే ఉన్నందున టీవీల ధర కూడా అధికం అవుతుందని ప్యానాసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ మనీష్ శర్మ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులనుబట్టి టీవీల ధర వచ్చే నెలకల్లా 5–7 శాతం అధికం కానుందని ఆయన వెల్లడించారు. ధరల సవరణ తప్ప తమకు మరో మార్గం లేదని హాయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా తెలిపారు. ఓపెన్–సెల్ ప్రైస్ గణనీయంగా పెరిగిందని, ట్రెండ్ ఇలాగే కొనసాగనుందని అన్నారు. ఓపెన్–సెల్‌కు అనుగుణంగా టీవీల ధరలను సవరించాల్సిందేనని స్పష్టం చేశా రు. తాము టీవీల ధరను పెంచడం లేదని ఎల్జీ వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరిలో ధరలను సవరించామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా హోం అప్లయెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ బాబు తెలిపారు. వాటికి కొరత ఉన్నందునే.. మార్కెట్లో ఓపెన్–సెల్ ప్యానెళ్లకు కొరత ఉందని సూపర్ ప్లాస్ట్రానిక్స్ తెలిపింది. గడిచిన ఎనిమిది నెలల్లో వీటి ధర మూడింతలైందని కంపెనీ సీఈవో అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. అంతర్జాతీయంగా ప్యానెళ్ల మార్కెట్ మందగించిందని, అయినప్పటికీ నెల రోజుల్లో ధర 35% అధికమైందని చెప్పారు. ఏప్రిల్ నుంచి ఒక్కో టీవీ ధర కనీసం రూ.2–3 వేలు పెరగనుందన్నారు. ఫ్రాన్స్ కంపెనీ థామ్సన్, యూఎస్ సంస్థ కొడాక్ టీవీల లైసెన్స్‌ను భారత్‌లో సూపర్ ప్లాస్ట్రానిక్స్ కలిగి ఉంది. అత్యధికంగా అమ్ముడయ్యే 32 అంగుళాల టీవీల ధర రూ. 5–6 వేలు పెరగ వచ్చని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ చెప్పారు. -
బిగ్ బిలియన్ డేస్ : రూ. 6 వేలకే టీవీ
సాక్షి, ముంబై : యూరప్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ తక్కువ ధరలకే స్మార్టీవీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అక్టోబర్ 16 - 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో జరగనున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో ఈ బంపర్ ఆఫర్ కొనుగోలుదారులకు అందించనుంది. 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్' పేరుతో దీన్ని తీసుకువచ్చింది. గత 3 సంవత్సరాలుగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ ప్రస్తుతం హర్ బాత్ బాధి పేరిట మార్కెటింగ్ నిర్వహిస్తోంది. ఆర్9 సిరీస్ థామ్సన్ టీవీ డీల్స్ రూ .5999 నుండి ప్రారంభమవుతాయి. ఆండ్రాయిడ్ థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.10999 నుండి ప్రారంభం. (విద్యార్థులకు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్) ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో టీవీ ఆఫర్లు ఆర్ 9 సిరీస్ కింద రెండు టీవీలు 24 హెచ్డీ బేసిక్ 5,999 రూపాయలు, 32 హెచ్డీ బేసిక్ ధర 8,499 రూపాయల వద్ద అందుబాటులో ఉంటాయి. (ఆపిల్ దివాలీ గిఫ్ట్ : కళ్లు చెదిరే ఆఫర్) పాథ్ సిరీస్ థామ్సన్ మోడళ్లు 32 పాథ్ 0011 ధర - 10,999 రూపాయలు 32 పాథ్ 0011బీఎల్ ధర -11,499 రూపాయలు 40 పాథ్ 7777 ధర - 15,999 రూపాయలు 43 పాథ్ 0009ధర - 18,999 రూపాయలు 43 పాథ్ 4545 ధర -22,499 రూపాయలు 50 పాథ్1010 ధర -24,499 రూపాయలు 55 పాథ్ 5050 ధర - 28,999 రూపాయలు ఆథ్రో సిరీస్ థామ్సన్ టీవీ మోడల్స్ 43 ఆథ్రో 2000 - 22,499 రూపాయలు 50 ఆథ్రో 1212 - 27,499 రూపాయలు 55 ఆథ్రో 0101 - 30,999 రూపాయలు 65 ఆథ్రో 2020 - 45,999 రూపాయలు 75ఆథ్రో 2121 - 94,499 రూపాయలు సాధ్యమైనంతవరకు తమ వినియోగదారుడిని ఆనందపరిచేందుకే చూస్తున్నామనీ, ఈ సీజన్ లో 200,000 యూనిట్ల అమ్మకాన్ని అంచనా వేస్తున్నామని థామ్సన్ టీవీ ఇండియా బ్రాండ్ లైసెన్సీ, సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో గూగుల్ భాగస్వామ్యంతో సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలను తీసుకొచ్చిన థామ్సన్ ప్రీమియం, బడ్జెట్ ధరల్లో సెమీ, ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కూడా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. (నోకియా స్మార్ట్ టీవీలపై ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు) -
ఆ కంపెనీలకు షాక్: కొత్త స్మార్ట్ టీవీలు వచ్చేశాయ్
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి థామ్సన్ టీవీలు వచ్చేశాయ్.. ముఖ్యంగా స్మార్ట్‌టీవీ సెగ్మెంట్లోకి చైనా కంపెనీ షావోమి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో థామ్సన్ సరికొత్త రీఎంట్రీ ప్రాధాన్యతను సంతరించుకుంది. స్మార్ట్ ఎఫ్‌హెచ్‌డీ టీవీలను భారత టీవీ మార్కెట్లో లాంచ్ చేసింది. గురువారం 40, 43, 32 అంగుళాల మూడు స్మార్ట్ టీవీలను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌లో శుక్రవారం విక్రయాలు మొదలు కానున్నాయని కంపెనీ వెల్లడించింది. 43 అంగుళాల 4కే యూహెచ్డీ థామ్సన్ టీవీ ధరను 27,999రూపాయలుగానూ, 40అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 19,990 రూపాయల ధర ట్యాగ్‌ను, 32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ రూ. 13.490గా నిర్ణయించింది. 43 అంగుళాల 4కే యేహెచ్‌డీ టీవీ మోడల్ పేరు 43టీఎం4377 : 3840x2160 పిక్సల్స్ రిజల్యూషన్ హెచ్డీఆర్, విత్ ఎల్ జీఐపీఎస్ ప్యానెల్ , ఆండ్రాయిడ్ 4.4.4 కిట్ కాట్, 1.4GHz డ్యూయల్ కోర్ కార్టెక్స్- ఏ53 ప్రాసెసర్, అలాగే మాలి-టీ720 జీపియూ, 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, 10వాట్స్ రెండు స్పీకర్లు, వై ఫై కనెక్టివిటీ 40అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 40టీఎం4099 మోడల్ , 1920x1080 పిక్సల్స్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 5.1.1 లాలిపాప్, కార్టిక్స్- ఏ53 ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ , 10 వాట్స్ రెండు స్పీకర్లు, వై ఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లు 32 అంగుళాల థామ్సన్ స్మార్ట్ టీవీ 32ఎం3277 మోడల్: 1366x768 పిక్సల్స్ రిజల్యూషన్, 450 నిట్స్ , ఆండ్రాయిడ్ 5.1.1 కార్టిక్స్-ఏ53 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, 20వాట్స్ టోటల్ ఆడియో అవుట్‌పుట్, వైఫై కనెక్టివిటీ ప్రధాన ఫీచర్లుగా ఉంటాయి. కాగా ఫ్రాన్స్‌కు చెందిన బిజినెస్ ఫ్రాన్స్, టెక్నికలర్ ఎస్ఏ ఫ్రాన్స్ ల ఉమ్మడి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండే థామ్సన్. యురోపియన్ మార్కెట్లో థామ్సన్ స్మార్ట్ టీవీలను విక్రయిస్తోంది. తాజా వ్యూహంతో తక్కువ ధరకే స్మార్ట్ టీవీలతో భారత మార్కెట్లో పాగా వేయనుంది. తద్వారా దేశంలో మైక్రోమ్యాక్స్, వూ, షావోమి లాంటి బడ్జెట్ ధరల్లో టీవీలను అందిస్తున్న కంపెనీలకు భారీ షాకే ఇవ్వనుంది. -
పరమాణు నిర్మాణం.. వివిధ సిద్ధాంతాలు..
రసాయనశాస్త్రం కంటికి కనిపించని అతి సూక్ష్మ పదార్థం..‘పరమాణువు’. కానీ దీని నిర్మాణ ఆవిష్కరణ ఆధునిక విజ్ఞానశాస్త్ర అధ్యయనాన్ని కొత్తపుంతలు తొక్కించింది. నేటి ఆధునిక జీవనానికి అవసరమైన ఎన్నో ఉపకరణాలను రూపొందించడంలో కీలక భూమికను పోషించింది. పరమాణువు నిర్మాణ ఆవిష్కరణకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. క్రీ.పూ. 2600 సంవత్సరాల క్రితం ‘కణాదుడు’ అనే భారతీయ రుషి, తన ‘వైశేషిక సూత్ర’ అనే గ్రంథంలో అణువును ప్రస్తావించాడు. అతని ప్రకారం పదార్థం అణువులు అనే అతిచిన్న కణాలతో నిర్మితమవుతుంది. ఈ అణువులు పరమాణువులుగా పిలిచే మరింత చిన్న కణాలతో రూపొందుతాయి.(అణువు) అనే పదం గ్రీకు పదమైన నుంచి వచ్చింది. దీని అర్థం విభజించడానికి వీలు కానిది. పరమాణు నిర్మాణం-కొన్ని సిద్ధాంతాలు డాల్టన్ సిద్ధాంతం:డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం పదార్థం అణువులతో నిర్మితమవుతుంది.అణువును విభజించడానికి వీలుకాదు.ఒకే మూలకానికి చెందిన అణువులన్నీ ఒకే రకంగానూ, వేర్వేరు మూలకాలకు చెందిన అణువులు వేర్వేరుగా ఉంటాయి.తర్వాత కాలంలో థామ్సన్, మిల్లీకాన్ వంటి శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగ ఫలితాలు అణువు విభజింప వీలు కాదు అనే డాల్టన్ వాదన తప్పని నిరూపించాయి. థామ్సన్ నమూనా: థామ్సన్ ప్రయోగం ప్రకారం.. పరమాణువు లోపల ఎలక్ట్రాన్లు రుణావేశ పూరితాలుగా ఉంటాయి. దీని ఆధారంగా థామ్సన్ పరమాణు నమూనాను ప్రతిపాదించాడు.థామ్సన్ ప్రతిపాదన ప్రకారం పరమాణువు గోళాకారంలో ఉండి ధనావేశాన్ని కలిగి ఉంటుంది.పరమాణు భారం.. పరమాణు అంతటా ఏకరీతిన విస్తరించి ఉంటుంది.ధన, రుణావేశాలు సమానంగా ఉండి పరమాణువు విద్యుత్‌పరంగా తటస్థంగా వ్యవహరిస్తుంది. రూథర్‌ఫర్‌డ నమూనా: 1909లో న్యూజిలాండ్‌కు చెందిన రూథర్‌ఫర్‌డ ్చ కణ పరిక్షేపణ ప్రయోగంతో మరో నూతన పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. పరమాణువులోని ధనావేశ కణాలన్నీ కలిసి ‘కేంద్రకా’న్ని ఏర్పరుస్తాయి. అయితే కేంద్రకంలో ఎలక్ట్రాన్లు ఉండవు.రుణావేశ పూరిత ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ వృత్తాకార కక్ష్యల్లో తిరుగుతుంటాయి (సూర్యుని చుట్టూ గ్రహాలు తిరిగే విధంగా).పరమాణు పరిమాణంతో పోల్చితే కేంద్రక పరిమాణం చాలా చిన్నది. పరిమితులు: నిర్దిష్ట త్వరణంతో వృత్తాకార మార్గంలో తిరుగుతున్న ఆవేశపూరిత కణాలు నిరంతరం శక్తిని ఉద్గారిస్తూ, కొంత సమయానికి శక్తిని కోల్పోయి కేంద్రకం నుంచి విడిపోయే అవకాశం ఉంది. అప్పుడు పరమాణువు నాశనమై పదార్థ ఉనికి ఉండదు. కానీ అలా జరగడం లేదు. తర్వాత జరిగిన పరిశోధనలు, కాంతి ప్రయాణించే విధానం, విద్యుదయస్కాంత వర్ణపటం, వర్ణపట రేఖల విశ్లేషణ వంటి నూతన భావనలు పరమాణు నిర్మాణాన్ని మరింత నిశితంగా పరిశీలించేట్లు చేశాయి. బోర్ పరమాణు నమూనా: ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిర్దిష్ట వృత్తాకార మార్గాల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ వృత్తాకార మార్గాలనే ‘కక్ష్యలు’ లేదా ‘ప్రధాన శక్తి స్థాయిలు’ అంటారు.ఎలక్ట్రాన్లు కక్ష్యల్లో తిరుగుతున్నంత సేపూ శక్తిని కోల్పోవు. కాబట్టి ఇవి కేంద్రకంలో పడిపోయే అవకాశం ఉండదు.ఈ కక్ష్యలను ఓ, ఔ, క, ూ... అనే అక్షరాలు లేదా = 1, 2, 3... అనే సంఖ్యలతో సూచిస్తారు. కానీ దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. బోర్ కేవలం హైడ్రోజన్ వర్ణపటాన్ని మాత్రమే వివరించాడు. ఈ నేపథ్యంలో ‘వర్ణపటం’ వివరాలను పరిశీలిస్తే.. విద్యుదయస్కాంత తరంగం: ఏదైనా విద్యుదావేశం కంపిస్తూ ఉంటే అది తన చుట్టూ ఉండే విద్యుత్ క్షేత్రంలో మార్పు చేస్తుంది. ఈ విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రంలో కూడా మార్పునకు లోనవుతుంది. ప్రసార దిశకు లంబంగా, ఒకదానికొకటి లంబదిశలో ఉండేలా విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు ఏర్పడే ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఈ విద్యుదయస్కాంత తరంగాలు, విస్తృత వైవిధ్యం గల పౌనఃపున్యాల సముదాయాన్ని ‘విద్యుదయస్కాంత వర్ణపటం’ అంటారు. మాక్స్‌ప్లాంక్ ప్రతిపాదన: విద్యుదయస్కాంత శక్తి అవిచ్ఛిన్నం. దీని నుంచి ఉద్గారం లేదా శోషణం ఎల్లప్పుడూ జిఠకి పూర్ణాంకంగా ఉంటుంది. ఉ = జిఠ’జి’ ప్లాంక్ స్థిరాంకం. దీని విలువ6.626 ణ 10ృ34 ఒ..ఈ భావనల ఆధారంగా బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. కానీ హైడ్రోజన్ వర్ణపటాన్ని అధిక సామర్థ్యం ఉన్న వర్ణపటదర్శినితో చూస్తే కొన్ని ఉపరేఖల సమూహాలు కనిపించాయి. ఈ ఉపరేఖలను బోర్ వివరించలేకపోయాడు. సోమర్ ఫెల్డ్ నమూనా: సోమర్ ఫెల్డ్, బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్ష్యలను అలాగే ఉంచి రెండో కక్ష్య నుంచి ఒక్కొక్క దీర్ఘ వృత్తాకార కక్ష్యను కలుపుతూ, పరమాణు కేంద్రకం ఈ దీర్ఘ వృత్తాకార కక్ష్య రెండు ప్రధాన నాభుల్లో ఒకదానిపై ఉంటుందని ప్రతిపాదించాడు.పరిమితులుఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువుల పరమాణు వర్ణపటాలను వివరించడంలో సోమర్ ఫెల్డ్ నమూనా విఫలమైంది. క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా(ఇర్విన్ ష్రోడింగర్):దీని ప్రకారం బోర్ నమూనాలోని కక్ష్యలకు బదులుగా.. ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్లు, పరమాణువులో కేంద్రకం చుట్టూ నిర్ణీత ప్రాంతంలో అధికంగా ఉంటాయి.పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లను కనుక్కునే సంభావ్యత ఏ ప్రాంతంలో అయితే అధికంగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని ‘ఆర్బిటా అంటారు. క్వాంటం సంఖ్యలు: పరమాణువులో కేంద్రకం చుట్టూ ఉండే ప్రదేశంలో ఎలక్ట్రాన్‌ను కనుక్కునే సంభావ్యతను క్వాంటం సంఖ్యలు సూచిస్తాయి. 1.ప్రధాన క్వాంటం సంఖ్య ()ప్రధాన క్వాంటం సంఖ్య ప్రధాన కర్పర (కక్ష్య) పరిమాణం, శక్తిని తెలుపుతుంది. దీన్ని తో సూచిస్తాం.2.కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య ’’తో సూచిస్తారు. ప్రధాన క్వాంటం సంఖ్య () విలువకు, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య () విలువలు 0 నుంచి (4 ృ 1) వరకు ఉంటాయి. ప్రతి ’’ విలువ ఒక ఉప కర్పరాన్ని , దాని ఆకృతిని తెలియజేస్తుంది. 3.అయస్కాంత క్వాంటం సంఖ్య అయస్కాంత క్వాంటం సంఖ్యను (ఝ)తో సూచిస్తారు. దీని విలువలు ృ నుంచి + వరకు ఉంటాయి.ఉదా: = 2 అయిన ఝ విలువలు ృ 2, ృ 1, 0, + 1, + 2. అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ ఆర్బిటాళ్ల ప్రాదేశిక దృగ్విన్యాసాన్ని వివరిస్తుంది.ఈ క్వాంటం సంఖ్యల ఆధారంగా ఆర్బిటాళ్ల ఆకృతులను నిర్ణయించారు.గోళాకారంగా, ఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో, ఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఆకారంలోనూ ఉంటాయి. 4.స్పిన్ క్వాంటం సంఖ్య ఇది ఎలక్ట్రాన్ స్పిన్‌ను తెలియజేస్తుంది. సవ్య దశలో దీని విలువ + 1/2. అపసవ్య దిశలో ృ 1/2. ఎలక్ట్రాన్ విన్యాసం:పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు, ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్ల పంపిణీని ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు. ఇది మూడు నియమాలపై ఆధారపడి ఉంటుంది. 1. పౌలీ వర్జన నియమం: ఒకే పరమాణువుకి చెందిన ఏ రెండు ఎలక్ట్రాన్లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. ఉదా: ఏ్ఛ లోని రెండు ఎలక్ట్రాన్లను పరిశీలిస్తే 1వ ఎలక్ట్రాన్ 1 0 0 +1/2 2వ ఎలక్ట్రాన్ 1 0 0 ృ1/2 2. ఆఫ్ బౌ నియమం: ఎలక్ట్రాన్లు వివిధ ఆర్బిటాళ్లలో.. ఆయా ఆర్బిటాళ్ల ( + ) విలువలు పెరిగే క్రమంలో నిండుతాయి. ఒకవేళ ( + ) విలువ సమానమైతే ’’ విలువ తక్కువగా గల ఉపకర్పరాన్ని ఎలక్ట్రాన్లు ముందుగా ఆక్రమిస్తాయి.( + ) విలువలు పెరిగే క్రమం1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d < 4p < 5s < 4d < 5p < 6s < 4f < 5d < 6p < 7s < 5f < 6d < 7p < 8s ...3.హుండ్ నియమం:ఈ నియమం ప్రకారం సమాన శక్తి కలిగిన అన్ని ఖాళీ ఆర్బిటాళ్లు ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఆక్రమించిన తర్వాతనే ఎలక్ట్రాన్లు జతకూడడం ప్రారంభిస్తాయి. మాదిరి ప్రశ్నలు 1. ’క’ కర్పరంలో ఇమడగలిగే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య? 1) 2 2) 8 3) 18 4) 32 2. = 2 అయితే దాని కోణీయ ద్రవ్య వేగ క్వాంటం సంఖ్య () = ? 1) 1 2) 2 3) 0 4) 3 3 ‘ఆర్బిటాల్’ అనే భావనను ప్రతిపాదించింది? 1) నీల్స్‌బోర్ 2) ష్రోడింగర్ 3) ప్లాంక్ 4) రూథర్ ఫర్డ 4 ఞ - ఆర్బిటాల్ ఆకృతి? 1) గోళాకార 2) సమతలం 3) డంబెల్ 4) డబుల్ డంబెల్ 5 వీటిలో ఎలక్ట్రాన్ ముందుగా ఆక్రమించే ఆర్బిటాల్? 1) 2s 2-) 2p- -3-) 3s- -4) 3p 6 వృత్తాకార కక్ష్య పరిమాణాన్ని, శక్తిని తెలిపే క్వాంటం సంఖ్య? 1)- l -2-) mll- -3-) n- -4) ms 7 రూథర్ ఫర్డ ్చ కణ పరిక్షేపణ ప్రయోగం ద్వారా ప్రతిపాదించింది? 1) ఎలక్ట్రాన్ 2) ప్రోటాన్ 3) న్యూట్రాన్ 4) కేంద్రకం 8. దృగ్గోచర వర్ణపటానికి ఉదాహరణ? 1) సముద్రం నీరు నీలం రంగులో కనిపిస్తుంది. 2) ఆకాశం నీలం రంగులో కనిపిస్తుంది. 3) ఇంద్రధనస్సు ఏర్పడుతుంది 4) ఆకులు పచ్చగా కనిపిస్తాయి. 9. విద్యుదయస్కాంత తరంగాలు ఏ తరంగ లక్షణాలను కలిగి ఉంటాయి? 1) దైర్ఘ్య 2) తిర్యక్ 3) స్థిర 4) కాంతి 10. థామ్సన్ నమూనాను దేనితో పోల్చవచ్చు? 1) కోసిన పుచ్చకాయ 2) సౌరమండలం 3) బంతి 4) ఉడికించి, నిలువుగా కోసిన కోడిగుడ్డు 11. కేంద్రకానికి, వేలన్సీ ఆర్బిటాల్‌కు మధ్య దూరాన్ని ఏమంటారు? 1) పరమాణు వ్యాసార్థం 2) పరమాణు భారం 3) 1,2 4) ఏదీకాదు 12. వీటిలో మెగ్నీషియం (ో =12) ఎలక్ట్రాన్ విన్యాసం? 1-) 1s22s22p63p2- -2-) 1s22s23p63s2 -- -3-) 1s22s22p63d2-- -4) 1s22s22p63s2- 13. = 4 అయినా ఝ విలువల సంఖ్య? 1) + 4 2) - 4 3) 0 4) 9 14. ఎలక్ట్రాన్‌ను కనుక్కునే సంభావ్యత పరమాణువులో అధికంగా ఉండే ప్రదేశం? 1) కక్ష్య 2) ఉపకక్ష్య 3) ఆర్బిటాల్ 4) కేంద్రకం 15. ’ఔ’ కక్ష్యలో వుండే ఉపకక్ష్యలు- 1)- s -2-) p- -3-) d- -4) s,p 16. ఒకటి కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువుల వర్ణపటాన్ని వివరించలేక పోయిన నమూనా? 1) బోర్ పరమాణు నమూనా 2) రూథర్‌ఫర్‌డ 3) థామ్సన్ నమూనా 4) డాల్టన్ నమూనా 17. అయస్కాంత క్వాంటం సంఖ్యను ప్రతిపాదించింది? 1) నీల్స్‌బోర్ 2) లాండె 3) సోమర్ ఫెల్డ్ 4) ఉలెన్‌బెక్, గౌడ్ స్మిత్ సమాధానాలు: 1) 3; 2) 1; 3) 3; 4) 2; 5) 3; 6) 1; 7) 3; 8) 4; 9) 3; 10) 3; 11) 2; 12) 1; 13) 1; 14) 4; 15) 4; 16) 3; 17) 4; 18) 1; 19) 2.