టెలికంకు 41 లక్షల మంది సిబ్బంది అవసరం! | Telecom Sector Will Need Over 4 Million Workforce by 2022: Prasad | Sakshi
Sakshi News home page

టెలికంకు 41 లక్షల మంది సిబ్బంది అవసరం!

Jan 23 2016 1:45 AM | Updated on Sep 3 2017 4:07 PM

టెలికంకు 41 లక్షల మంది సిబ్బంది అవసరం!

టెలికంకు 41 లక్షల మంది సిబ్బంది అవసరం!

వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధి చెందుతోన్న భారత టెలికం రంగానికి 2022 నాటికి 41 లక్షల మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమౌతారని..

న్యూఢిల్లీ: వార్షిక ప్రాతిపదికన 15 శాతం వృద్ధి చెందుతోన్న భారత టెలికం రంగానికి 2022 నాటికి 41 లక్షల మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమౌతారని కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రజలకు శిక్షణనిచ్చే నిమిత్తం డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్), స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (ఎంఎస్‌డీఈ) మంత్రిత్వశాఖ మధ్య ఒక పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా డాట్, ఎంఎస్‌డీఈలు స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన జాతీయ ఆక్షన్ ప్లాన్ అభివృద్ధి చేయడంతోపాటు దాన్ని టెలికం రంగంలో అమలు చేయనున్నారు. టెలికం రంగంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది శిక్షణ కోసం ఎంఎస్‌డీఈ, డాట్‌లు సంయుక్తంగా ఆర్థిక చేయూత అందించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement