టెక్‌​ మహింద్రా సీఈవోకి భారీ వేతనం | Sakshi
Sakshi News home page

టెక్‌​ మహింద్రా సీఈవోకి భారీ వేతనం

Published Fri, Jul 7 2017 2:31 PM

టెక్‌​ మహింద్రా సీఈవోకి భారీ వేతనం

ముంబై: ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో టెక్‌ కంపెలన్నీ ఉద్యోగులకు వేతనాలు పెంచకుండా వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఈ వేతనాల పెంపు వాయిదా వేసిన కంపెనీలో టెక్‌మహింద్రా కూడా ఒకటి. వేతనపెంపుకు ఆశపడే టెక్‌ మహింద్రా ఉద్యోగులు మరో రెండు నెలల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న సీపీ గుర్నాని వేతన ప్యాకేజీ వివరాలు బహిర్గతమయ్యాయి.
 
గత మూడేళ్లలో టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలతో పోల్చుకుంటే గుర్నానికే భారీ వేతనాలు అందినట్టు తెలిసింది. కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా వ్యవహరిస్తున్న గుర్నాని రూ.150.7 కోట్ల పారితోషికాలను ఆర్జిస్తున్నట్టు వెల్లడైంది. 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థికసంవత్సరంలో కూడా టాప్‌-3 కంపెనీలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో సీఈవోల కంటే కూడా అత్యధికంగా గుర్నాని, పరిహారాలు పొందినట్టు వీసీసర్కిల్‌ రిపోర్టు నివేదించింది. పబ్లిక్‌ కంపెనీల్లో అత్యధికంగా వేతనాలు పొందే ఎగ్జిక్యూటివ్‌ల వివరాలను ఇది రిపోర్టు చేస్తుంది.
 
గుర్నాని పారితోషికాల్లో రూ.147.17 కోట్లు స్టాక్‌ ఆప్షన్ల నుంచి వస్తున్నట్టు తెలిసింది. ఆయన వేతనం, ప్రావిడెంట్‌కు ఆయన అందించే సహకారం మొత్తం కలిపి కేవలం రూ.2.56కోట్లేనట. కాగ, టీసీఎస్‌ మాజీ సీఈవో, ప్రస్తుతం టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పారితోషికాలు రూ.30.15 కోట్లకు పెరుగగా, ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కా వేతనం స్వల్పంగా తగ్గి రూ.45.11 కోట్లగా ఉంది. విప్రో చీఫ్‌కు వేతనాలు పెరిగినట్టు రిపోర్టు తెలిపింది. 
 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement