ఫ్రాన్స్‌లో టీసీఎస్‌ మరో డెలివరీ సెంటర్‌

TCS opens its third delivery centre in France - Sakshi

న్యూఢిల్లీ: భారత ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఫ్రాన్స్‌లో కొత్త డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఫ్రాన్స్‌లోని సురెసెన్స్‌లో ఈ డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేశామని టీసీఎస్‌ తెలిపింది. ఈ సెంటర్‌లో ఉద్యోగుల సంఖ్య 230 వరకూ ఉంటుందని టీసీఎస్‌ సీఈఓ, ఎండీ రాజేశ్‌ గోపీనాధన్‌ చెప్పారు.

ఫ్రాన్స్‌లో ఇప్పటికే రెండు డెలివరీ సెంటర్లను ఏర్పాటు చేశామని, ఇది మూడో డెలివరీ సెంటర్‌ అని వివరించారు. 2012లో లిల్లేలో, 2014లో పొయిటీర్స్‌లో ఈ సెంటర్లను ఆరంభించామని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top