టాటా జెస్ట్ స్పెషల్ ఎడిషన్

టాటా జెస్ట్ స్పెషల్ ఎడిషన్


న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కంపెనీ జెస్ట్ మోడల్‌లో స్పెషల్ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ స్పెషల్ ఎడిషన్ కారు ధరలు రూ.5.89 లక్షల నుంచి  రూ. 6.94 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చి ఏడాదైన సందర్భంగా ఈ స్పెషల్ ఎడిషన్‌ను అం దుబాటులోకి తెస్తున్నామని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు. ఎంపిక చేసిన షోరూమ్‌ల్లో సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్ వరకూ ఈ కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో సంబంధిత కేటగిరీలో జెస్ట్ కారు అత్యుత్తమంగా నిలుస్తుందని వివరించారు. స్పెషల్ ఎడిషన్ జెస్ట్‌ను యానివర్శరీ ప్యాక్‌తో అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్యాక్‌లో రియర్ విండ్‌షీల్డ్, రిమోట్‌తో పనిచేసే పవర్ కర్టెన్, ఫ్లోర్ కన్సోల్ బాటిల్ హోల్డర్, స్కఫ్ ప్లేట్స్ వంటి ఫీచర్లున్నాయని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top